Watson on Kohli: కోహ్లి కడుపు రగిలిపోయిన మాట నిజమే.. గంగూలీతో వివాదంపై వాట్సన్ షాకింగ్ కామెంట్స్-watson on kohli says he had fire in his belly over no hand shake with ganguly ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Watson On Kohli: కోహ్లి కడుపు రగిలిపోయిన మాట నిజమే.. గంగూలీతో వివాదంపై వాట్సన్ షాకింగ్ కామెంట్స్

Watson on Kohli: కోహ్లి కడుపు రగిలిపోయిన మాట నిజమే.. గంగూలీతో వివాదంపై వాట్సన్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Watson on Kohli: కోహ్లి కడుపు రగిలిపోయిన మాట నిజమే అంటూ గంగూలీతో వివాదంపై వాట్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ, డీసీ మధ్య మ్యాచ్ లో ఈ ఇద్దరి వివాదం ప్రముఖంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

కోహ్లి, గంగూలీ హ్యాండ్ షేక్ చేసుకోవడానికి నిరాకరించడంతో బయటపడిన విభేదాలు (IPL)

Watson on Kohli: కోహ్లి కడుపు రగిలిపోయిందట. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ స్టాఫ్ లో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ వెల్లడించాడు. కోహ్లి, గంగూలీ మధ్య ఏదో జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో వాట్సన్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం, అదే మ్యాచ్ లో దాదాను విరాట్ గుర్రుగా చూసిన వీడియో బయటకు రావడంతో ఈ వివాదం బయటి ప్రపంచానికి తెలిసింది.

ఇక ఆ తర్వాత దాదాను ఇన్‌స్టాగ్రామ్ లో విరాట్ అన్‌ఫాలో చేశాడు. ఆ వెంటనే గంగూలీ కూడా అదే పని చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇండియన్ క్రికెట్ లో గొప్ప కెప్టెన్లుగా నిలిచిన ఈ ఇద్దరి మధ్య గొడవలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పుడు వాట్సన్ కామెంట్స్ వీళ్ల గొడవ నిజమే అన్నట్లుగా ఉండటం గమనార్హం.

ది గ్రేడ్ క్రికెటర్ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన వాట్సన్.. ఈ వివాదం గురించి తానేమీ మాట్లాడనని, అయితే కోహ్లి కడుపు రగిలిపోయినట్లుగా కనిపించిన మాట నిజమేనని మాత్రం చెప్పాడు.

"అది కేవలం పుకారు మాత్రమే కావచ్చు. నాకు కచ్చితంగా తెలియదు. నేను అందులో జోక్యం చేసుకోదలచుకోలేదు. కానీ విరాట్ కాస్త రగిలిపోతున్నట్లు కనిపించాడు. ఓ ప్రత్యర్థిగా అలా జరగకూడదని కోరుకోవాలి. ఎందుకంటే అలాంటి సమయంలోనే విరాట్ తన అత్యుత్తమ ఆట ఆడతాడు. దానికి కారణమేంటన్నది మాత్రం నాకు తెలియదు" అని వాట్సన్ స్పష్టం చేశాడు.

కోహ్లి, గంగూలీ వివాదం చాలా రోజులుగా ఉంది. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే విరాట్ తన కెప్టెన్సీ కోల్పోయాడు. ఆ తర్వాత గతేడాది అక్టోబర్ లో బీసీసీఐ పదవి నుంచి తప్పుకున్న దాదా.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ గా చేరాడు.

సంబంధిత కథనం