Virat Kohli in UPSC Exam: యూపీఎస్సీ ఎగ్జామ్ పేపర్‌లో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. ఈ ఆన్సర్ మీకు తెలుసా?
Virat Kohli in UPSC Exam: యూపీఎస్సీ ఎగ్జామ్ పేపర్‌లో విరాట్ కోహ్లిపై ప్రశ్న అడిగారు. దానికి ఆన్సర్ ఏంటో మీకు తెలుసా? నిజానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నే.
Virat Kohli in UPSC Exam: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ ప్రశ్నను యూపీఎస్సీ ఎన్డీయే(UPSC NDA) ఎగ్జామ్ లో అడగడం విశేషం. ఈ పరీక్ష ఆదివారం (ఏప్రిల్ 16) జరిగింది. టీ20 వరల్డ్ కప్ లలో విరాట్ ప్రదర్శకు సంబంధించిన ప్రశ్న అది. ఈ విషయాన్ని ట్విటర్ లో ఓ యూజర్ షేర్ చేసుకున్నాడు. సదరు ప్రశ్నాపత్రం ఫొటోను సదరు యూజర్ పోస్ట్ చేయడం విశేషం.
ఈ ప్రశ్నలో టీ20 వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ గురించి కూడా ప్రశ్న ఉంది. కింది స్టేట్‌మెంట్ లలో ఏది కరెక్ట్ అనేది ప్రశ్న. టీ20 వరల్డ్ కప్ ను రెండుసార్లు గెలిచిన ఏకైక టీమ్ ఇంగ్లండ్ అనేది ఒక స్టేట్మెంట్ కాగా.. టీ20 వరల్డ్ కప్ లలో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లి అన్నది రెండో స్టేట్మెంట్.
వీటిలో ఏది కరెక్ట్ అన్నది ప్రశ్న. నిజానికి రెండో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. విరాట్ కోహ్లి 2014, 2016 వరల్డ్ కప్ లలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లు అందుకున్నాడు. 2014 వరల్డ్ కప్ లో 319, 2016 వరల్డ్ కప్ లో 273 రన్స్ చేశాడు. ఇక మొదటి స్టేట్మెంట్ తప్పు. ఇంగ్లండ్ తోపాటు వెస్టిండీస్ కూడా టీ20 వరల్డ్ కప్ ను రెండుసార్లు అందుకుంది.
ఇంగ్లండ్ 2009, 2022లో.. వెస్టిండీస్ 2012, 2016లలో టీ20 వరల్డ్ కప్స్ గెలిచాయి. ఇక యూపీఎస్సీ పరీక్షల్లో క్రికెట్ కు సంబంధించిన ప్రశ్నలు అడగటం ఇదే తొలిసారి కాదు. ఈ మధ్య యూపీఎస్సీ సీడీఎస్ పరీక్షలోనూ గతేడాది టీ20 వరల్డ్ కప్ గురించి అడిగారు. ఆ ట్రోపీలో హ్యాట్రిక్ తీసుకున్న కార్తీక్ మేయప్పన్ ఏ టీమ్ కు చెందిన ప్లేయర్ అన్నది ప్రశ్న. దీనికి సమాధానం యూఏఈ.
సంబంధిత కథనం