Egg Bread Toast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఓసారి ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు-egg bread toast recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Bread Toast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఓసారి ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు

Egg Bread Toast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఓసారి ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు

Haritha Chappa HT Telugu
Apr 03, 2024 06:00 AM IST

Egg Bread Toast: పిల్లలకు ఎప్పుడూ ఇడ్లీ, దోశ పెడితే బోర్‌గా ఫీల్ అవుతారు. ఒకసారి ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేసి చూడండి. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కూడా. దీన్ని చేయడం చాలా సులువు.

ఎగ్ బ్రెడ్ టోస్ట్
ఎగ్ బ్రెడ్ టోస్ట్ (Youtube)

Egg Bread Toast: బ్రేక్‌ఫాస్ట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దోశ, ఉప్మా లాంటివి. ఒకసారి ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఇది నచ్చడం ఖాయం. దీన్ని చేయడానికి కేవలం 10 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి పెద్దగా కష్టపడక్కర్లేదు. దీన్ని చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బ్రెడ్ ముక్కలు - రెండు

గుడ్లు - రెండు

కారం - అర స్పూను

పసుపు - పావు స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర స్పూను

మిరియాల పొడి - పావు స్పూను

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - ఒకటి

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

పచ్చిమిర్చి - ఒకటి

బటర్ - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెసిపీ

1. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో గుడ్లను పగలగొట్టండి.

2. గుడ్లను బాగా గిలక్కొట్టి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా చేయండి.

3. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కారం వేసి బాగా కలపండి.

4. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కాస్త బటర్ రాయండి.

5. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో నానబెట్టండి.

6. తర్వాత తీసి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చండి. అంతే టేస్టీ ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయినట్టే.

7. ఇది చాలా హెల్దీ రెసిపీ. దీని చేయడం కూడా చాలా సులువు. పిల్లలకి బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. రెండు గుడ్లు గిలక్కొట్టుకుంటే ఏడు నుంచి ఎనిమిది బ్రెడ్ స్లైసులతో టోస్ట్ రెడీ చేసుకోవచ్చు.

మైదాతో చేసిన బ్రెడ్ ను వినియోగించడం మాని... మల్టీ గ్రెయిన్ లేదా గోధుమ పిండితో చేసిన హోల్ వీట్ బ్రెడ్‌ను వినియోగించడం మంచిది. రొట్టె కాస్త గట్టిగా ఉంటే టోస్ట్ టేస్టీగా వస్తుంది. బ్రెడ్ మరీ మెత్తగా ఉందనుకుంటే ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక ప్లేట్లో ముక్కలను వేసి అరగంట పాటు ఫ్రిజ్లో పెట్టండి. అది గట్టిగా అవుతాయి. అప్పుడు ఈ ఎగ్ మిశ్రమంలో ఉంచితే అవి టేస్టీగా కాస్త గట్టిగా వస్తాయి.

టాపిక్