Butter In Food: రోజూ అల్పాహారంలో బటర్ తినడం వల్ల బోలెడు లాభాలు.. అవేంటో చూడండి..
Butter In Food: రోజూ ఉదయం ఆహారంలో బటర్ చేర్చుకోవడం వల్ల అనేక విటమిన్లు అందుతాయి. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూడండి.

బటర్ లాభాలు (freepik)
వెన్న అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఇది తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందేమోనన్న సందేహంతో చాలా మంది దీన్ని తినరు. అయితే రోజూ ఉదయపు అల్పాహారంలో కొద్దిగా వెన్నను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మనం తినే ఆహారంలో కొన్ని విటమిన్‌లు కొవ్వులో కరిగి మనకు ఉపయోగ పడతాయి. విటమిన్ ఏ, డీ, ఈ, కేలను ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్‌లు అంటారు. ఇవి మన శరీర అవసరాలకు ఉపయోగ పడాలంటే మనలో కొవ్వు కాస్త ఉండాలన్న మాట. అందుకనే రోజూ తగిన మోతాదులో వెన్న తినడం వల్ల ఆహారాలకు రుచీ పెరుగుతుంది. మీకు ఆరోగ్యమూ చేకూరుతుంది.
వెన్న తినడం వల్ల లాభాలు:
- వెన్నలో ఉండే కొన్ని రకాల ఫ్యాటీ యాసిడ్లు మనలో జీవ క్రియను మెరుగు పరుస్తాయి. అందువల్ల మన శరీరం నుంచి మరిన్ని ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది ఒక విధంగా సహకరిస్తుంది. డైట్‌లో ఉన్న వారూ నిరభ్యంతరంగా దీన్ని తినవచ్చు. ఎలాంటి సందేహం అవసరం లేదు.
- దీనిలో బీటా కెరోటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది లోపలికి వెళ్లిన తర్వాత ఏ విటమిన్‌గా మారుతుంది. దీనివల్ల దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ల లాంటివి రాకుండా ఉంటాయి.
- వెన్నలో ఎక్కువ మొత్తంలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మపు ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగు పరుస్తుంది.
- వెన్నపూసలో విటమిన్ డి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఎముకల సాంద్రత తగ్గకుండా ఉండాలన్నా, అవి దృఢంగా మారాలన్నా ఇది ఉపయోగ పడుతుంది. దీనిలో డీ విటమిన్‌తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. అందువల్ల బోలు ఎముకల వ్యాధుల్లాంటివి రావు. తొందరగా ఎముకలు విరగడం లాంటివి జరగవు.
- దీనిలో ఈ విటమిన్ తగినంతగా దొరుకుతుంది. అందువల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. దెబ్బలు తొందరగా తగ్గుతాయి. వాపులు తగ్గుతాయి. అతి నీలలోహిత కిరణాల వల్ల చర్మం ఎక్కువ దెబ్బ తినకుండా చూస్తుంది.
- వెన్న తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి తక్షణమే అందుతుంది. దీనిలోని కొవ్వులు పిల్లల మెదడు పెరుగుదలకు, నరాల బలానికి ఉపయోగపడతాయి. ఇందులోని అరాచిడోనిక్ యాసిడ్ మెదడు శక్తివంతంగా పని చేయడానికి సహాయ పడుతుంది.
- దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరగడానికి దోహద పడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే వెన్నను తక్కువ మోతాదులో రోజూ తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
టాపిక్