Fruits for health: పరగడుపున ఈ పండ్లు తిన్నారంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు
fruits for health: ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ పరగడుపున ఈ పండ్లు తినేయండి. డాక్టర్ దగ్గరకి వెళ్ళే అవసరమే రాదు.
fruits for health: ఆరోగ్యకరమైన శరీరం కోసం పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉదయం టిఫిన్ తో పాటు పండ్లు, జ్యూస్ తీసుకుంటారు. కానీ కొన్ని పండ్లు ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పండ్లు ఖాళీ కడుపుతో తుంటే ఆరోగ్యంగా ఉండటమే కాదు మీకు అదనపు శక్తి లభిస్తుంది.
పుచ్చకాయ
జ్యూసీగా ఉండే పుచ్చకాయ తినడం వల్ల మీ శరీరం చల్లబడుతుంది. ఇది హైడ్రేటింగ్ పండు. ఇందులో 92 శాతం నీరే ఉంటుంది. సుదీర్ఘ ఉపవాసం చేసిన తర్వాత ఈ పండు తీసుకుంటే శరీరం హైడ్రేట్ అవుతుంది. పుచ్చకాయలో లైకొపీన్ అధికంగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్. ఎలక్ట్రోలైట్స్ నిండి ఉంటాయి. నిర్జలీకర్ణాన్ని తగ్గించే అద్భుతమైన పండు. పుచ్చకాయతో మీ డే స్టార్ట్ చేశారంటే మీరు హైడ్రేట్ గా ఉంటారు.
బొప్పాయి
కొన్ని పౌండ్లు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే బొప్పాయి సరైన ఎంపిక. తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. విటమిన్లు ఏ, సి, ఇ ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారికి ఉత్తమమైన ఎంపిక. పపైన్, చైమోపపైన్ వంటి ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకి దోహద పడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. బరువు తగ్గడమే కాదు జీర్ణవ్యవస్థ సజావుగా ఉండేలా చూస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది.
పైనాపిల్
రోగనిరోధక వ్యవస్థ అందించే సూపర్ ఫ్రూట్ పైనాపిల్. విటమిన్ సి, మాంగనీస్ ఉన్నాయి. శరీరం పోషకాలని శోషించుకోవడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ, ఎముకలని బలోపేతం చేస్తుంది. ఉబ్బరం, వాపుని తగ్గిస్తుంది.
యాపిల్
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకి వెళ్ళే అవసరం రాదని అంటారు. ఇందులోని పెక్టిన్ జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. మెదడు పని తీరుని మెరుగుపరుస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని ఇస్తుంది. యాపిల్ తింటే మీ పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది.
కివి
విటమిన్లు, ఖనిజాలు నిండిన శక్తివంతమైన పండు కివి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే అద్భుతమైన పండు. రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం, ప్రకాశవంతమైన చర్మం కావాలన్నా మీరు కివి తినేయండి.
అరటి పండ్లు
పేదవాడి యాపిల్ అరటి పండు అంటారు. అందరికీ అందుబాటులో ఉంటాయి. పొటాషియంకి గొప్ప మూలం. ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం చేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఉన్నాయి. కండరాల పనితీరుకి బాగా ఉపయోగపడుతుంది. గుండెకి మేలు చేస్తుంది. సులభంగా జీర్ణమయ్యే పండు.
పియర్స్
మీ పొట్ట నిండుగా ఉండేలా చేసే పండు పియర్స్. విటమిన్ సి, కె, పొటాషియం, కాపర్ అధికంగా ఉన్నాయి. మూత్రపిండాలు, పేగులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. గుండెకి మేలు చేసే పండు. జీర్ణక్రియకి మద్దతు ఇస్తుంది.