బ్లాక్ యాపిల్స్ లో అధిక పోషక విలువలు ఉంటాయి. ఆపిల్ వెరైటీలలో బ్లాక్ డైమండ్ యాపిల్ చాలా ప్రత్యేకమైనది.
Unsplash
By Anand Sai Nov 19, 2023
Hindustan Times Telugu
ఈ బ్లాక్ డైమండ్ యాపిల్ ప్రత్యేకమైనది. చాలా ఖరీదైనవి కూడా. వీటిని టిబెట్‌లోని పర్వత ప్రాంతాలలో సాగు చేస్తారు.
Unsplash
ఈ యాపిల్స్ పైన నల్లగా ఉన్నా లోపల మాత్రం మామూలు యాపిల్ లాగా తెల్లగా ఉంటుంది. అనేక రకాల వ్యాధులను కూడా నయం చేస్తుంది.
Unsplash
బ్లాక్ యాపిల్‍లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
Unsplash
ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
Unsplash
మార్కెట్‌లో బ్లాక్ యాపిల్ ధర ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కటి రూ.500 వరకు పలుకుతున్నాయి.
Unsplash
ఇతర యాపిల్ సాగుతో పోలిస్తే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో వాటిని పెంచడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. నాణ్యత పరంగా, దాని సాగుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
Unsplash
సాధారణ ఆపిల్ రకాలు రెండు లేదా మూడు సంవత్సరాలలో ఫలాలను ఇస్తాయి. బ్లాక్ డైమండ్ యాపిల్స్ పండాలంటే 8 ఏళ్లు ఆగాల్సిందే. అప్పటి వరకు దీని నిర్వహణకు చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.
Unsplash
ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీటిలో ఒకే టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా?