Pesaripappu Kadi Recipe । పెసరిపప్పు పకోడి కడి కర్రీ.. రుచికరమైనది, ఆరోగ్యకరమైనది!
Pesaripappu Kadi Recipe: వానాకాలంలో మీరు పకోడిలు తినేలా, మీ జీర్ణ ఆరోగ్యం బాగుండేలా అద్భుతమైన పెసరిపప్పు పకోడి కడి రెసిపీ ఇక్కడ తెలియజేస్తున్నాం.
Healthy Monsoon Recipes: వర్షం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. వానాకాలం రాకతో వాతావరణం చల్లబడుతుంది, ప్రకృతి పులకిస్తుంది. వర్షపు చినుకులతో మన చుట్టూ ప్రతీది పచ్చగా, అందంగా మారుతుంది. మరోవైపు ఈ సీజన్ మన ఆరోగ్యానికి కొన్ని సవాళ్లు కూడా విసురుతుంది. వర్షాకాలంలో ఆహారం విషయంలో సురక్షితంగా ఉండటం మంచిది. కానీ మనం వేడివేడి పకోడీలు, రుచికరమైన చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతాం. వీటిని మనం ఎలాగూ నియంత్రించుకోలేం, కాబట్టి మన జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండేలా సరిగ్గా వండుకోవడం, ఆరోగ్యకరంగా తినడం ముఖ్యం.
వానాకాలంలో మీరు పకోడిలు తినేలా, మీ జీర్ణ ఆరోగ్యం బాగుండేలా ఇక్కడ ఒక అద్భుతమైన వంటకాన్ని మీకు తెలియజేస్తున్నాం. పెసరిపప్పు పకోడి కడి రెసిపీ ఈ మాన్‌సూన్ సీజన్ కోసం అనువైనది, ఆరోగ్యకరమైనది. దీనిని ఎలా చేయాలో ఈ కింద చూడండి.
Moong Dal Kadi/ Pesaripappu kadi Recipe కోసం కావలసినవి
- 300 గ్రాములు పెసరిపప్పు
- 2 కప్పుల పెరుగు
- 1 చిటికెడు ఇంగువ
- 1/2 tsp జీలకర్ర
- 1/2 tsp మెంతులు
- 1 tsp పసుపు పొడి
- 2-3 పచ్చిమిర్చి - 2 నుండి 3
- 1/4 tsp కారం
- ఉప్పు రుచికి తగినంత
- 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర
- నూనె పకోడి వేయించడానికి
పెసరిపప్పు కడిని ఎలా తయారు చేయాలి
- ముందుగా పెసరిపప్పును శుభ్రంగా కడిగి 2-3 గంటలు నీటిలో నానబెట్టండి.
- నానబెట్టిన పప్పును నీళ్లలోంచి తీసి ముద్దగా రుబ్బుకోవాలి. ఆపై ఈ పప్పు పేస్ట్‌ను 2 భాగాలుగా విభజించి, ఒక దానిలో పెరుగును, సరిపడా నీరు కలిపి పలుచగా చేసుకోవాలి.
- మిగిలిన భాగాన్ని ఒక పాత్రలో వేసి, అందులో కొత్తిమీర వేసి పకోడి పిండిలా తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసి, నూనె వేడయ్యాక గుండ్రంగా పకోడిలు చేసుకోవాలి. బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించి ఆపైన ఒక ప్లేటులో పెట్టుకోవాలి.
- ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పలుచటి పెసరిపప్పు పిండిలో , కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.
- ఉడుకుతున్న కూరలో సిద్ధం చేసుకున్న పకోడిలు కూడా వేసి, ఉప్పును సర్దుబాటు చేసి ఉడికించాలి, కలుపుతూ ఉండాలి.
- ఉడికిన తర్వాత మంటను తగ్గించండి, పిట్లలాంటి పదార్థం తయారవుతుంది. ఇందులో కొద్దిగా కారం, కొత్తిమీర చల్లండి,
- ఇప్పుడు మరొక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి, తక్కువ మంటపై ఇంగువ, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఆపైన పసుపు పొడి, పచ్చిమిర్చి, ఎండు మిరపకాయలను వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపును వంటకంలో కలిపేయాలి.
అంతే, పెసరిపప్పు పకోడి కడి రెడీ.. అన్నంతో అయినా, చపాతీలతో అయినా తింటే అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం