Ajwain tea: ప్రతి ఉదయం ఖాళీ పొట్టతో వాము టీ తాగి చూడండి, వేసవిలో తాగడం ఎంతో ముఖ్యం-drink ajwain tea every morning on an empty stomach it is healthy in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ajwain Tea: ప్రతి ఉదయం ఖాళీ పొట్టతో వాము టీ తాగి చూడండి, వేసవిలో తాగడం ఎంతో ముఖ్యం

Ajwain tea: ప్రతి ఉదయం ఖాళీ పొట్టతో వాము టీ తాగి చూడండి, వేసవిలో తాగడం ఎంతో ముఖ్యం

Haritha Chappa HT Telugu
Apr 17, 2024 10:30 AM IST

బరువు తగ్గడం నుండి డిటాక్స్ వరకు, వేసవి ఉదయాలలో ఖాళీ కడుపుతో అజ్వైన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

వాము టీ
వాము టీ (Shutterstock)

ప్రాచీన మసాలా దినుసుల్లో వాము ఒకటి. దీన్ని ఆంగ్లంలో అజ్వైన్ (Ajwain) అంటారు. వేసవిలో కచ్చితంగా తాగాల్సిన పానీయాలలో ఇదీ ఒకటి. ఉదయాన్నే ఖాళీ పొట్టతో ఒక కప్పు అజ్వైన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో కూడా వామును శక్తివంతమైన క్లెన్సర్‌గా చెబుతారు. వాము తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి రాకుండా ఉంటాయి.

వాము టీ ఎలా చేయాలి?

ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ వాము వేసి మరిగించాలి. అంతే అజ్వైన్ టీని రెడీ అయిపోతుంది. కొన్ని నిమిషాల తరువాత దాన్ని వడకట్టి ఒక కప్పులో పోసి ఉదయన ఖాళీ పొట్టతో తాగాలి. దీనిలో రుచి కోసం తేనె, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం వంటివి కలుపుకోవచ్చు.

వామును ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మసాలా దినుసు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు బ్యాక్టీరియా, ఫంగస్ లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అజ్వైన్ పెప్టిక్ అల్సర్లను నయం చేస్తుంది.

అజ్వైన్ టీ వల్ల ప్రయోజనాలు

వేసవి కాలంలో ఖాళీ పొట్టతో అజ్వైన్ టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

1. జీర్ణక్రియను పెంచుతుంది

వాము టీ వ్యక్తుల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అజ్వైన్ లోని థైమోల్, ఇతర క్రియాశీల పదార్థాలు, గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని ప్రేరేపించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, అసిడిటీ వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్న వారికి, భోజనం తర్వాత కడుపు నొప్పి ఉన్నవారికి ఇది గొప్ప ఎంపిక.

2. ఆకలిని మెరుగుపరుస్తుంది

అజ్వైన్ టీ ఆకలిని ప్రేరేపిస్తుంది. వేసవి వేడి ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. ఈ టీ తాగడం వల్ల ఆకలి వేస్తుంది. అజ్వైన్ టీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆకలిని ప్రోత్సహిస్తుంది.

3. ఉబ్బరం నుండి ఉపశమనం

ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలను వదిలించుకోవడానికి అజ్వైన్ టీ ఉత్తమం. వాములో ఉండే కార్మినేటివ్ లక్షణాలు గ్యాస్, కడుపుబ్బరం వంటివి రాకుండా అడ్డుకుంటాయి.

4. డిటాక్స్ లో సహాయపడుతుంది

అజ్వైన్ టీ తాగడం వల్ల అదనపు ప్రయోజనం కూడా కలుగుతుంది…. అదే డిటాక్సిఫికేషన్. వాము తినడం వల్ల మూత్ర విసర్జన సవ్యంగా జరుగుతుంది. మూత్రవిసర్జన ద్వారా వ్యర్థాలు, ఇతర విషాలను బయటకు తీయడానికి శరీరాన్ని ప్రోత్సహిస్తాయి.

5. జీవక్రియను పెంచుతుంది

అజ్వైన్ టీ జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది. అజ్వైన్ టీ మొత్తం జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియ వల్ల బరువు అదుపులో ఉంటుంది.

Whats_app_banner