Diwali Candle Decoration : దీపావళి రోజున ఇంట్లో ఈ రంగు క్యాండిల్స్ వెలిగిస్తే.. ఇక మీతోనే లక్
Diwali 2023 Decoration : భారతదేశంలో దీపావళి పండగను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. చీకట్లను తరిమికొట్టి.. జీవితాల్లోకి వెలుగును ఆహ్వానిస్తారు. అయితే ఈరోజున కొన్ని పద్ధతులను పాటించాలి.
Deepavali 2023 : ఎంతో మంది ఎదురుచూస్తున్న దీపావళి(Deepavali) పండగ వచ్చేస్తుంది. దీపాల పండుగ దీపావళి నాడు మనమందరం ఇళ్లను దీపాలతో అందంగా అలంకరించుకుంటాం. దీపావళి రోజులో దీపాల వెలుగులు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇంట్లోని ప్రతి మూలను లైట్లతో అలంకరించి ఇంటిని దేదీప్యమానంగా వెలిగిస్తారు.
ఇంట్లో వెలిగించిన దీపాలు, కొవ్వొత్తులను సరైన స్థలంలో, దిశలో ఉంచినట్లయితే ఇంటికి అందం, మీకు శ్రేయస్సు లభిస్తుందని కూడా నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రోజున వెలిగించే దీపాలు లేదా కొవ్వొత్తులు సరైన దిశలో ఉండాలి. శాస్త్రం ప్రకారం, ప్రతి దిశ ఒక నిర్దిష్ట రంగును సూచిస్తుంది. దీపావళి నాడు ఆ దిశలో ఆ రంగుల కొవ్వొత్తిని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పుడు ఏ దిశలో, ఏ రంగు కొవ్వొత్తి సంపద, అదృష్టం కలిగిస్తుందో చూద్దాం.
ఇంట్లో ఎరుపు కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఇంటికి సంపద, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అది కూడా ఈ ఎరుపు రంగు కొవ్వొత్తులను ఇంటికి దక్షిణ దిశలో వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుంది.
దీపావళి రోజున ఇంట్లో పసుపు కొవ్వొత్తులను వెలిగించడం జీవితంలో పురోగతికి మార్గాలను తెరుస్తుంది. ఈ రంగుల కొవ్వొత్తులను లక్ష్మీ దేవి మార్గంలో ఇంటి తలుపు వద్ద వెలిగించాలి. అంతేకాకుండా ఇంటి శ్రేయస్సు కోసం ఇంటి వరండా మధ్యలో దీపాలు పెట్టాలి.
నల్ల కొవ్వొత్తి రక్షణకు చిహ్నం. ఈ నలుపు రంగు కొవ్వొత్తిని ఇంటి తలుపు వద్ద వెలిగిస్తే, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించబడుతుంది. అలాగే ఇంటికి ఉత్తరం వైపున నల్ల కొవ్వొత్తులను వెలిగిస్తే జీవితంలోని చెడు శక్తులు తొలగిపోయి జీవితం కాంతివంతంగా మారుతుంది.
దీపావళి రోజున తెల్లని కొవ్వొత్తి వెలిగించడం వల్ల జీవితంలో శాంతి, సామరస్యం కలుగుతాయి. ఈ తెల్లని కొవ్వొత్తిని ఇంటికి పడమర, ఈశాన్య మూలలో వెలిగించాలి. దీనిని ప్రధానంగా ఈశాన్య దిశలో అమర్చడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
ఆకుపచ్చ కొవ్వొత్తి ఇంట్లో డబ్బును పెంచుతుంది. ఈ దీపావళికి ఇంట్లో దీపాలు వెలిగించేటప్పుడు, ఆకుపచ్చ కొవ్వొత్తిని కూడా వెలిగించడం మర్చిపోవద్దు. ఈ ఆకుపచ్చ కొవ్వొత్తిని తూర్పు దిశలో వెలిగిస్తే జీవితంలో పురోగతిని వస్తుంది. అలాగే, ఈ కొవ్వొత్తిని వెలిగించడానికి ఉత్తమమైన దిక్కు ఆగ్నేయ దిశ అని చెబుతారు.