Alzheimer's Disease : ఈ అలవాట్లు మీకు ఉంటే.. మీకు అల్జీమర్స్ పక్కా..
Alzheimer's Disease : ఒత్తిడితో కూడిన, నిశ్చలమైన, అనారోగ్యకరమైన మీ జీవనశైలిని మిమ్మల్ని ప్రాణాంతక వ్యాధులకు దగ్గర చేస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా మెదడు సమస్యలు ఎక్కువగా వస్తాయి. అల్జీమర్స్, చిత్తవైకల్యం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే మెదడును చురుకుగా ఉంచేందుకు.. మీరు దూరం చేసుకోవాల్సిన అలవాట్లు, దగ్గర చేసుకోవాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
Alzheimer's Disease : మన ఆధునిక జీవనశైలిలోని పలు లోపాల కారణంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక్కడ శరీరానికే దిక్కు లేదంటే.. మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంటున్నారా? అనుకోవాలే కానీ.. ఆరోగ్యంపై దృష్టి పెడితే చాలు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు.. శరీరం, మెదడు కూడా ఆరోగ్యంగా, బలంగా మారిపోతుంది. 'వ్యాయామం' శరీరానికే అనుకుంటాము కానీ.. అది మన మెదడుకు కూడా చాలా శక్తిని ఇస్తుంది.
దానికి మనం సరైన పని చెప్పకపోతే.. అభిజ్ఞా క్షీణతకు దారితీస్తుంది. మెల్లిగా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. చక్కెరతో కూడిన, అధిక కేలరీల ఆహారం మెదడు వాపునకు దారితీయవచ్చు. కాబట్టి ఆహారంలోనే కాదు.. మన జీవన శైలిలో పలు మార్పులు చేస్తే.. మనం ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే అల్జీమర్స్ సమస్యను రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుంది. అల్జీమర్స్ వ్యాధిని కలిగించే హానికరమైన అలవాట్లు గురించి.. మెదడును షార్ప్ చేసే అలవాట్ల గురించి తెలుసుకుని.. మీరు ఫాలో అయిపోండి..
వీటికి దూరంగా ఉండండి..
నిశ్చల జీవనశైలి
నిశ్చలమైన జీవనశైలి, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల.. మెదడు నెమ్మదిస్తుంది. ఇది జీవనశైలి వ్యాధులకు దోహదం చేస్తుంది. వ్యాయామం అనేది మన మెదడును ఆరోగ్యంగా, పదునుగా చేస్తుంది. అవి హృదయ స్పందన రేటును పెంచుతాయి. ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి. ముఖ్యంగా మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సాహిస్తాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తగినంత నిద్ర
తగినంత నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట నిద్రమత్తుకు కారణమవుతుంది. ఇది మీ ఉత్పాదకత, శ్రద్ధను తగ్గిస్తుంది. ఎక్కువసేపు నిద్రపోకపోవడం వల్ల మీ మెదడులోని టౌ అనే ప్రోటీన్ స్థాయిని పెంచవచ్చు. ఇది నేరుగా అభిజ్ఞా క్షీణతకు సంబంధించినది. అంతేకాకుండా ఇది అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది.
డీ హైడ్రేషన్
సాధారణంగా మన శరీరం 70% నీటితో నిండి ఉంటుంది. కాబట్టి కనీసం రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తారు. అయితే తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది డిమెన్షియాకు కారణమవుతుంది.
డ్రగ్స్, ఆల్కహాల్ వినియోగం
ఆల్కహాల్ అతిగా సేవించడం వల్ల మీ మెదడుకు హాని కలిగవచ్చు. ఇది మీ డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం వస్తుందని కచ్చితంగా చెప్పలేము. అలా అని చిత్తవైకల్యం రాకుండా ఎక్కువ రక్షణను అందించడానికి వీటిని తయారు చేయలేదు.
పేలవమైన ఆహారం
చీజ్ బటర్ కేకులు, రెడ్ మీట్ మొదలైన అధిక సంతృప్త కొవ్వుల తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే అవి అభిజ్ఞా సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. బదులుగా విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా ఈ ఆహారాలను భర్తీ చేసుకోవచ్చు.
మెదడు కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు
మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం కొన్ని చిట్కాలను అనుసరించడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..
* ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.
* మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.
* పని నుంచి విరామం తీసుకోండి.
* కాస్త జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
* మీ కుటుంబంతో సమయం గడపండి.
* వ్యాయామం, యోగా సాధన చేయండి.
* ఒత్తిడిని తగ్గించుకోండి.
సంబంధిత కథనం