Chana Dal Pulao Recipe : బరువు తగ్గాలనుకుంటే.. చనా దాల్ పులావ్ తినేయాలట..-chana dal pulao is protein rich lunch for weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chana Dal Pulao Recipe : బరువు తగ్గాలనుకుంటే.. చనా దాల్ పులావ్ తినేయాలట..

Chana Dal Pulao Recipe : బరువు తగ్గాలనుకుంటే.. చనా దాల్ పులావ్ తినేయాలట..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 13, 2022 12:56 PM IST

Lunch Recipe for Weight loss : ప్రజాధారణ పొందిన రుచికరమైన పప్పులలో పచ్చిశనగపప్పు ఒకటి. అయితే దీనితో చేసే పలు రెసిపీలను డైట్​లో చేర్చుకుంటే బరువు తగ్గుతారంటున్నారు ఆరోగ్యనిపుణులు. చనా దాల్​తో ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్​గా చేసుకోగలిగే రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చనా దాల్ పులావ్
చనా దాల్ పులావ్

Chana Dal Pulao Recipe : మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.బరువు తగ్గాలి అనుకునేవారు.. తమ డైట్​లో దీనిని తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు తగ్గడానికి ప్రోటీన్-రిచ్ డైట్ చాలా ముఖ్యమని చెప్తున్నారు. చనా దాల్ పులావ్​ ప్రోటీన్​ను ఎక్కువగా కలిగి ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బియ్యం - 300 గ్రాములు

* పచ్చి శనగపప్పు - 1 కప్పు

* పెద్ద ఉల్లిపాయ - 1 (కట్ చేసుకోవాలి)

* టొమాటో - 2 (ప్యూరీ చేసుకోవాలి)

* పచ్చిమిర్చి - 2 (కట్ చేసుకోవాలి)

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

* కారం - 2 స్పూన్లు

* జీలకర్ర - 1 టీస్పూన్

* బే ఆకు - 1

* యాలకులు - 2

* మిరియాల పొడి - కొంచెం

* లవంగాలు - 2

* ఉప్పు - సరిపడినంత

* ధనియాపొడి - 1 టీ స్పూన్

* పసుపు - చిటికెడు

తయారీ విధానం

ఈ రెసిపీని తయారు చేసుకోవాలి అనుకున్నరోజు.. వంట ప్రారంభించడానికి ముందుగా శనగ పప్పును 2 గంటలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల పప్పు మెత్తగా, తేలికగా ఉడకుతుంది. పప్పు నానిన తర్వాత.. ప్రెజర్ కుక్కర్‌ తీసుకుని స్టవ్​ వెలిగించి దానిపై ఉంచండి. దానిలో నూనె వేసి.. మొత్తం మసాలాలు వేయండి. ఉల్లిపాయలు వేసి.. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. అనంతరం టొమాటో ప్యూరీ, ధనియాలపొడి, పసుపు వేసి బాగా వేయించాలి. దానిలో కారం కూడా వేసి బాగా కలపండి.

ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, బియ్యం వేసి బాగా కలపాలి. రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్‌పై మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత.. గ్యాస్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతే వేడి వేడి చనా దాల్ పులావ్ రెడీ. దీనిని చట్నీతో లేదా ఇతర కర్రీలతో, రైతాతో సర్వ్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం