Rental Agreement : 11 నెలల కంటే ముందే అద్దెకు ఉన్నవారిని ఇంటి యజమానికి వెళ్లగొట్టవచ్చా?
Rental Agreement 11 Months : తెలుగు రాష్ట్రాల్లో ఇంటి యజమాని, అద్దెకు ఉండేవాళ్ల మధ్య గొడవలు తరచూగా అవుతుంటాయి. ఒకవేళ అగ్రిమెంట్ చేసుకుంటే 11 నెలల కంటే ముందే అద్దెదారులను యజమాని ఖాళీ చేయించవచ్చా?
భారతదేశంలో ఇంటి యజమాని, అద్దెదారు మధ్య పరస్పర అవగాహన ఆధారంగా ఇంటిని సాధారణంగా అద్దెకు తీసుకుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఇంటిని అద్దెకు తీసుకోవాలన్నా, లీజుకు తీసుకోవాలన్నా యజమానికి, అద్దెదారుకు మధ్య ఒప్పందం చేసుకోవాలని చట్టం చెబుతుంది. కానీ దాదాపు ఈ విషయాన్ని ఎవరూ పాటించరు. కేవలం నోటి మాట ఆధారంగానే ఒప్పందం ఉంటుంది. నిజానికి చట్టపరంగా వెళితేనే ఇద్దరికీ సేఫ్.
ఈ ఒప్పంద లేఖలో రెండు పార్టీలు అనుసరించాల్సిన కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయి. కొన్ని నగరాల్లో ఈ ఒప్పందం పద్ధతి అమల్లో ఉంది. ఒప్పందం 11 నెలలు అని చాలా మందికి తెలుసు. అయితే ఇక్కడ ఓ ప్రశ్న వస్తుంది. ఈ వ్యవధిలోపు అద్దెదారు ఇల్లు ఖాళీ చేయగలరా, ఇంటి యజమాని దీనికి అంగీకరిస్తారా? లేకపోతే, అద్దెదారుకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అద్దెదారు ఇంటికి రాకముందు ఉన్న వస్తువులు, వారి పరిస్థితి , యజమాని వసూలు చేసిన మరమ్మత్తు ఖర్చులాంటి ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు.
స్నేహ అనే ఉద్యోగి మహిళ నోయిడాలోని సెక్టార్ 34 సొసైటీలో అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లింది. అపార్ట్‌మెంట్‌కు వచ్చే ముందు ఇన్వర్టర్, గీజర్, ఆర్‌ఓ సహా అన్ని సౌకర్యాలు కొత్తవి. అపార్ట్‌మెంట్ యజమాని అద్దెదారుకు ఏదైనా పాడైపోతే మీరే రిపేర్ చేయాలని చెప్పాడు.
స్నేహ ఫ్లాట్‌కి వచ్చిన 3 రోజుల తర్వాత, RO, ఇన్వర్టర్ రెండూ నాసిరకంగా, పాతవిగా గుర్తించింది. ఈ విషయం యజమానితో చెప్పింది. దీంతో వారి మధ్య వాగ్వాదం మెుదలైంది. అద్దె ఒప్పందంలో 11 నెలలు అని పేర్కొన్నప్పటికీ, స్నేహను 6 నెలల తర్వాత ఇల్లు ఖాళీ చేయమని యజమాని కోరాడు. అయితే ఒప్పందం చేసుకున్నాక 11 నెలల ముందు ఇంటిని ఖాళీ చేయమని అద్దెదారుని అడగవచ్చా?
దేశంలోని టైర్-1, టైర్-2 నగరాల్లోని ఇళ్లను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయ వనరులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది నిశాంత్ రాయ్ చెప్పుకొచ్చారు. నివాస, వాణిజ్య ఆస్తులు అద్దెకు అందుబాటులో ఉన్నాయి. కానీ అద్దె ఒప్పందానికి సంబంధించి తగినంత నిబంధనలు, షరతులు సరిగా లేవు. ఎందుకంటే ఇది ప్రాథమిక అవసరాలను మాత్రమే ప్రస్తావిస్తుంది.
ఇంటి యజమాని, అద్దెదారు మధ్య పరస్పర అవగాహనలను కలిగి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో రెండు పార్టీలు అనుసరించాల్సిన కొన్ని షరతులతో కూడిన ఒప్పందం ద్వారా దీని కోసం చట్టపరమైన పత్రాలు రూపొందించారు. ఇది 11 నెలల ఒప్పందం. దీనికి ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలి. ఈ కాలంలో అద్దె పెంచరు. ఇంటి యజమాని అద్దెదారుని ఇంటిని ఖాళీ చేయమని అడగవచ్చు.., కానీ వారిని బలవంతంగా ఖాళీ చేయించలేరనే విషయాన్ని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎలాంటి బలవంతం చేయలేరని లాయర్ నిశాంత్ రాయ్ చెప్పుకొచ్చారు.
ఒక అద్దెదారు 11 నెలల వరకు కచ్చితంగా ఖాళీ చేయను అని చెబితే చట్టం ప్రకారం యజమాని ఏమీ చేయలేడని అర్థం. అందుకే అద్దె ఇచ్చేముందు యజమానులు పూర్తి సమాచారం తెలుసుకోవాలి.