AP Govt edX MOU: ఎడెక్స్‌తో నేడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం… విద్యార్ధులకు ఇకపై ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు..-ap govt signs agreement with edex today free online courses for students ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Edx Mou: ఎడెక్స్‌తో నేడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం… విద్యార్ధులకు ఇకపై ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు..

AP Govt edX MOU: ఎడెక్స్‌తో నేడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం… విద్యార్ధులకు ఇకపై ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు..

Sarath chandra.B HT Telugu
Feb 16, 2024 09:44 AM IST

AP Govt edX MOU: పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితం ఆన్‌లైన్‌ కోర్సులు ఉచితంగా అందించే లక్ష్యంతో ఎడెక్స్‌ సంస్థతో ఏపీ ప్రభుత్వం నేడు ఒప్పందం కుదుర్చుకోనుంది. .

ఎడెక్స్‌ సంస్థతో నేడు ఏపీ ప్రభుత్వ ఒప్పందం
ఎడెక్స్‌ సంస్థతో నేడు ఏపీ ప్రభుత్వ ఒప్పందం (YSRCP )

AP Govt edX MOU:పేద, మధ్య తరగతి విద్యార్ధులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సుల్ని అందించే లక్ష్యంతో ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం నేడు ఒప్పందం కుదుర్చుకోనుంది.

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో.. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం చేసుకోనున్నారు.

టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రూపొందించాయి. ఎడెక్స్ తో ఒప్పందం - ఉన్నత విద్యలో "గేమ్ ఛేంజర్" అవుతుందని ప్రభుత్వ విద్యా శాఖ చెబుతోంది.

"ఎడెక్స్ ఒప్పందం"లో ముఖ్యాంశాలు

ఏపీలో 12 లక్షల మందికి పైగా విద్యార్థుకు ప్రపంచ స్థాయి వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000+కు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని, సర్టిఫికెట్లు పొందేందుకు వీలు కలుగుతుంది.

ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో ఏపీ విద్యార్థులకు బోధన లభిస్తుంది.

హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ చేస్తారు. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

"ఎడెక్స్ ఒప్పందం"తో ప్రయోజనాలు

ప్రపంచంలో అనూహ్యంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను మన విద్యార్థులు ఉచితంగా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే వీలు కలుగుతుంది.

విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, యుసి బర్క్ లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు లభిస్తుంది.

అయా యూనివర్సిటీలే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్లో భాగమవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ గా ఎదుగుతారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

ప్రొఫెషనల్, సాంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి-- విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ, అభ్యసనా నైపుణ్యాలను అందించడంలో ఎడెక్స్ సహకారం అందుతుంది.

పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్ లోనూ ఇవ్వడం ద్వారా విద్యార్ధులకు అవకాశాలు మెరుగు పరుస్తున్నట్లు చెబుతున్నారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్/టైమ్స్ ర్యాంకింగ్స్ 21 ఫ్యాకల్టీలలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెబుతున్నారు.

జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ తో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు.. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు.. కరిక్యులమ్ లో భాగంగా సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్.. తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్ లైన్ లో నేర్చుకునే వెసులుబాటు లభించనుంది.

కరిక్యులమ్ లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్ షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం.. ఇప్పటికే 7 లక్షల మంది విద్యార్థులు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ తప్పనిసరి చేశారు. 5.2 లక్షల మంది 2 నెలల షార్ట్ టర్మ్ ఇంటర్న్ షిప్ మరియు 2 లక్షల మంది 6 నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయనున్నారు.

థియరీతో పాటు Industry oriented Courses చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్సరంలో 37,000 ఉన్నప్లేస్ మెంట్స్ ఇప్పుడు 2022-23లో 1 లక్షకు పెరిగిందని వివరిస్తున్నారు.

డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్ నుంచి Al, IoT. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనాలసిస్ & ఇన్వెస్ట్ మెంట్స్, లాజిస్టిక్స్, రిస్క్ మేనేజ్ మెంట్, స్టాక్ ఎక్చేంజ్, సైబర్ ఫోరెన్సిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్ అనాలసిస్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి మైనర్ కోర్సులు ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.

Whats_app_banner