AP High Court On SGT Posts : డీఎస్సీ నోటిఫికేషన్ లో ఆ రూల్ కు హైకోర్టు బ్రేక్, బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్టే
AP High Court On SGT Posts : ఎస్జీటీ పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్టే విధించింది.
AP High Court On SGT Posts : ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు(AP High Court) స్టే విధించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించమని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే ఈ రూల్ పై డీఈడీ అభ్యర్థులు అభ్యంతరం వ్కక్తం చేశారు. ఈ మేరకు కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తే డీఈడీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుుతుందని కోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు...సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT)పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్టే విధించింది.
గత విచారణలో వాదనలు
6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్(High Court On DSC Notification) ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇందులో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తామని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని బొల్లా సురేష్, మరికొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్జీటీ పోస్టులకు(SGT Posts) బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తే డీఈడీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీఈటీ నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపడుతుందని పిటిషనర్ వాదించారు.
సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు(High Court) సీజే ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. నోటిఫికేషన్ ప్రక్రియపై ముందుకెళ్లొద్దని, హాల్ టికెట్లు(Hall Tickets) జారీ చేయవద్దని ఓ దశలో సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఉత్తర్వులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం తెలియజేస్తామని ఏజీ కోర్టును కోరారు. 2018లో సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. నోటిఫికేషన్ పై ముందస్తు చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా బీఈడీ(B.Ed) అభ్యర్థులను అనుమతించాల్సి పరిస్థితి వచ్చిందని గత విచారణలో ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. అయితే అర్హులైన బీఈడీ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్స్ చేసిన తర్వాతే టీచింగ్ కు అనుమతిస్తామని కోర్టుకు తెలిపారు. బ్రిడ్జి కోర్సుకు చట్టబద్ధత ఎలా ఉంటుందని ప్రశ్నించిన సీజే....సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఎలా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఏజీని ప్రశ్నించారు.
ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల పది లక్షల మంది డీఈడీ(D.Ed) అభ్యర్థులు నష్టపోతున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు, ఎన్సీటీఈ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని వాదనలు వినిపించారు.
సంబంధిత కథనం