Brushing Techniques: ఎలా పడితే అలా బ్రష్ చేయొద్దు.. దంతాలు బాగా క్లీన్ అయ్యేందుకు ఈ టిప్స్ పాటించండి!-brushing techniques follow these steps for cleaner and healthy teeth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brushing Techniques: ఎలా పడితే అలా బ్రష్ చేయొద్దు.. దంతాలు బాగా క్లీన్ అయ్యేందుకు ఈ టిప్స్ పాటించండి!

Brushing Techniques: ఎలా పడితే అలా బ్రష్ చేయొద్దు.. దంతాలు బాగా క్లీన్ అయ్యేందుకు ఈ టిప్స్ పాటించండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 05, 2024 08:30 AM IST

Brushing Techniques: దంతాలను బ్రష్ చేసుకునేందుకు కొన్ని టెక్నిక్స్ పాటించాలి. అలా అయితే దంతాలు బాగా శుభ్రం అవుతాయి. వీటిపై శ్రద్ధ పెట్టారు. బ్రష్ చేసేందుకు ముఖ్యమైన టిప్స్ ఇవే..

Brushing Techniques: ఎలా పడితే అలా బ్రష్ చేయొద్దు.. దంతాలు బాగా క్లీన్ అయ్యేందుకు ఈ టిప్స్ పాటించండి!
Brushing Techniques: ఎలా పడితే అలా బ్రష్ చేయొద్దు.. దంతాలు బాగా క్లీన్ అయ్యేందుకు ఈ టిప్స్ పాటించండి!

దాదాపు అందరూ ప్రతీ రోజు దంతాలను బ్రష్ చేస్తారు. అయితే, ఉదయం హడావుడిగా కొందరు ఎలా పడితే అలా బ్రష్ చేస్తారు. టైమ్ లేదనే తొందరలో బ్రషింగ్‍పై శ్రద్ధ పెట్టరు. ఏదో అలా కానిచ్చేస్తుంటారు. అయితే, శ్రద్దతో బ్రష్ చేయడం చాలా ముఖ్యం. బ్రష్ చేసేందుకు కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి. ఇలా చేస్తేనే దంతాలు బాగా శుభ్రం అవుతాయి. డెంటల్ సమస్యల రిస్క్ తగ్గుతుంది. అలా బ్రష్ చేసేందుకు పాటించాల్సిన ముఖ్యమైన టెక్నిక్స్ ఏవో ఇక్కడ చూడండి.

45 డిగ్రీల కోణంలో..

బ్రష్‍ను సరైన విధంగా పట్టుకొని దంతాలను రుద్దడం వల్ల మెరుగ్గా శుభ్రం అవుతాయి. ముఖ్యంగా దడవ దగ్గర రుద్దే సమయంలో బ్రష్‍ను 45 డిగ్రీల కోణంలో పట్టుకోవాలి. ఈ యాంగిల్‍లో బ్రష్‍ను పట్టుకొని రుద్దడం వల్ల క్రిములు ప్రభావంతంగా తొలగిపోయి.. చిగుళ్ల వద్ద దంతాలు బాగా క్లీన్ అవుతాయి.

చుట్టూ క్లీన్ అయ్యేలా..

టూత్ బ్రష్‍పై పేస్ట్ వేసుకొని ముందరి దంతాలపై రుద్దేసి కొందరు బ్రషింగ్ ముగించేస్తుంటారు. అయితే అది సరికాదు. అన్ని దంతాలు వీలైనంత ఎక్కువగా క్లీన్ అయ్యేలా బ్రష్ చేయాలి. దంతాలు బయట, లోపలి భాగం, కింది భాగం, చిగుళ్ల వద్ద అంతా క్లీన్ అయ్యేలా శ్రద్ధగా బ్రష్ చేయాలి. దంతాల చుట్టూ బ్రష్ చేరి శుభ్రం అయ్యేలా జాగ్రత్త వహించాలి.

నిలువునా పట్టుకొని..

బ్రష్‍ను నిలువుగా పట్టుకొని ముందురి దంతాలను కాసేపు రుద్దాలి. బ్రష్‍ను కిందికి, పైకి కదుపుతూ రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముందరి పళ్ల మధ్య సందుల్లోనూ బాగా క్లీన్ అవుతుంది. వీలైనంత మేర క్రిములు తొలగిపోతాయి.

ధనాధన్ వద్దు

కొందరు బ్రషింగ్ చాలా వేగంగా.. హడావుడిగా చేస్తుంటారు. ఓ పని అయిపోతుందనేలా ధనాధన్ చేస్తుంటారు. అయితే, అది సరికాదు. దంతాలను శ్రద్ధతో నిదానంగా బ్రష్ చేసుకోవాలి. దంతాలపై మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. ఓ మోస్తరు ప్రెజర్‌తోనే పళ్లను రుద్దాలి. 2 నిమిషాల నుంచి 4 నిమిషాల పాటు బ్రష్ చేయాలి.

ఎలాంటి బ్రష్ తీసుకోవాలి.. ఎప్పుడు మార్చాలి?

మీ దంతాలకు సరిపోయేలా మృధువైన బిస్టల్స్ ఉండే టూత్ బ్రష్‍లను ఉపయోగించాలి. బ్రష్ హార్డ్‌గా ఉండే దంతాలకు, చిగుళ్లకు కూడా సమస్యగా మారుతుంది. బ్రష్‍ను ప్రతీ మూడు నెలలు లేకపోతే నాలుగు నెలలకు ఓసారి తప్పనిసరిగా మార్చాలి.

రోజుకు రెండుసార్లు

ప్రతీ రోజు రెండుసార్లు బ్రష్ చేస్తే మంచిదని దంత నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా దంతాలను బ్రష్ చేశాక ఆ ప్రభావం 8 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అందుకే ఉదయంతో పాటు నిద్రపోయే ముందు రాత్రి కూడా బ్రష్ చేసుకుంటే మంచిది. క్రిములు చేరకుండా ఉంటాయి. ఇలా చేస్తే దంతాల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.

Whats_app_banner