Brown Sugar For Skin : అందమైన చర్మం కోసం బ్రౌన్ షుగర్.. ఇలా ఉపయోగించాలి-brown sugar for your skin here s details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brown Sugar For Skin : అందమైన చర్మం కోసం బ్రౌన్ షుగర్.. ఇలా ఉపయోగించాలి

Brown Sugar For Skin : అందమైన చర్మం కోసం బ్రౌన్ షుగర్.. ఇలా ఉపయోగించాలి

HT Telugu Desk HT Telugu
Mar 25, 2023 10:00 AM IST

Brown Sugar For Skin : బ్రౌన్ షుగర్ ను 2 రోజులకు ఒకసారి మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్ ను ముఖం, మెడకే కాకుండా మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్లకు కూడా ఉపయోగించవచ్చు.

స్కిన్ కేర్
స్కిన్ కేర్

అందానికి అందరూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందంగా కనిపించడానికి అనేక సహజ పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. వంటగదిలో లభించే పండ్లు, కూరగాయలు, పెరుగు, చక్కెరను కూడా అందానికి ఉపయోగించొచ్చు. కేవలం వైట్ షుగర్ మాత్రమే కాదు బ్రౌన్ షుగర్(brown sugar) కూడా చర్మానికి చాలా ఉపయోగపడుతుంది.

బ్రౌన్ షుగర్ చర్మాన్ని(Skin) ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్, చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి మృతకణాలను తొలగిస్తుంది. కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. బ్రౌన్ షుగర్ చనిపోయిన కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తేనె, బ్రౌన్ షుగర్(brown sugar) సమాన పరిమాణంలో తీసుకుని, కలపాలి. దానికి లావెండర్ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.

బ్రౌన్ షుగర్ సహజ హ్యూమెక్టెంట్. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. సాధారణ చక్కెర కంటే బ్రౌన్ షుగర్ మెత్తగా ఉంటుంది. కొబ్బరి నూనె(Coconut Oil)తో కొద్దిగా బ్రౌన్ షుగర్ కలపండి. లావెండర్ నూనె జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

బ్రౌన్ షుగర్ డెడ్ స్కిన్ సెల్స్(dead skin cells) ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. చర్మంపై ఉన్న ట్యాన్‌ని తొలగించి, మెరిసేలా చేస్తుంది. టొమాటో స్లైస్‌లో బ్రౌన్ షుగర్ వేసి, యాంటీ క్లాక్ వైజ్‌లో ముఖం, మెడపై నెమ్మదిగా మసాజ్ చేయండి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మళ్లీ రెండు నిమిషాలు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బ్రౌన్ షుగర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్ లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఇది మెలనిన్ ఏర్పడటాన్ని కూడా నియంత్రిస్తుంది. నువ్వుల నూనెలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్రౌన్ షుగర్ చర్మాన్ని(Brown Sugar For Skin) తేమగా ఉంచుతుంది. బ్రౌన్ షుగర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు రాకుండా చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అలాగే, చర్మంపై బ్రౌన్ షుగర్ ఉపయోగించేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. లేకపోతే దద్దుర్లు రావచ్చు. పురుషులు కూడా బ్రౌన్ షుగర్ ఉపయోగించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం