Black Tomatoes: నల్ల టమాటాలు కనిపిస్తే కచ్చితంగా కొనుక్కోండి, ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు
Black Tomatoes: టమాటాలు లేనిదే ఏ కూర పూర్తికాదు, ఎప్పుడు ఎర్రటి టమాటాలే కొనుక్కుంటాం. ఒకసారి నల్ల టమాటాలను కూడా ప్రయత్నించండి. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ.
Black Tomatoes: టమాటాలు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. ఎప్పుడోగాని దాని రేటు పెరగవు. మిగతా సమయాల్లో 20 రూపాయలు కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ టమాటాలతో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఏ కూర కూడా టమోటా లేకుండా పూర్తవదు. ఎప్పుడూ ఎర్రటి టమాటాలే తింటే ఎలా? ఓసారి నల్ల టమాటాలను ప్రయత్నించండి. టమోటోల్లో ఈ నల్ల టమోటోలు చాలా ప్రత్యేకమైనవి. నల్లగా మెరిసిపోతూ ఉంటాయి. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. కనిపించినప్పుడే కొని తీసుకెళ్లండి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణితులను పెరగకుండా అడ్డుకునే శక్తిని కలిగి ఉంటాయి.
ఈ నల్ల టమోటోలు మనదేశంలోనూ సాగు చేస్తున్నారు. ఎక్కువగా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లలో ఈ నల్ల టమోటోలు దొరుకుతాయి. వీటిని ఇండిగో రోజ్ అని పిలుస్తారు. కానీ వీటి పంట చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇతర రాష్ట్రాల వరకు అమ్మకానికి రావు. ఎర్ర టమోటాలు కన్నా ఈ నల్ల టమోటాల్లో పోషకాలు ఎక్కువ. అంతేకాదు ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంటాయి.
క్యాన్సర్ బారిన పడిన రోగులు నల్ల టమోటాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. టమోటోలో ఉన్నట్టే ఈ నల్ల టమోటాల్లో కూడా లైకోపీన్, బీటా కెరాటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాకుండా మరెన్నో ఈ నల్ల టమోటాల ద్వారా లభిస్తాయి. కాబట్టి మీకు ఎప్పుడైనా ఈ నల్ల టమాటలు కనిపిస్తే కచ్చితంగా తెచ్చి ఇంట్లో వారికి వండి పెట్టండి. ఇవి చూడటానికి నల్లగా ఉన్నా రుచి మాత్రం బాగుంటాయి. వీటితో వండిన వంటకాలు కూడా ఇగురు బాగా వచ్చి టేస్టీగా ఉంటాయి. కాకపోతే రంగు మాత్రమే భయపడుతుంది.
నల్ల టమోటాలు ఎక్కడ పుట్టాయి?
ఈ నల్ల టమోటాలు తొలిసారిగా ఉక్రెయిన్లోని ఒక ద్వీపకల్పంలో పుట్టాయని చెబుతారు. అది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు. ఈ నల్ల టమోటాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు వీటిని తింటే చాలా మంచిది. అలాగే మధుమేహంతో బాధపడే వారు కూడా ఈ నల్ల టమోటాలను తినడం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతం మన దగ్గర చాలా అరుదుగా దొరుకుతున్నాయి.
టాపిక్