Eyebrows at home: ఐబ్రోలు తీయించడానికి బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. నొప్పిలేని, ఉత్తమ మార్గాలు వచ్చేశాయ్-best ways to shape eye brows at home without going parlour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eyebrows At Home: ఐబ్రోలు తీయించడానికి బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. నొప్పిలేని, ఉత్తమ మార్గాలు వచ్చేశాయ్

Eyebrows at home: ఐబ్రోలు తీయించడానికి బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. నొప్పిలేని, ఉత్తమ మార్గాలు వచ్చేశాయ్

Koutik Pranaya Sree HT Telugu
Aug 10, 2024 08:00 AM IST

Eyebrows at home: ఐబ్రోలు తీయించుకోడానికి పార్లర్ వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని సింపుల్ మార్గాలు ఫాలో అవ్వచ్చు. వాటితో నొప్పి కూడా ఉండదు. అవేంటో చూడండి.

ఇంటి దగ్గరే ఐబ్రోలు తీసుకునే మార్గాలు
ఇంటి దగ్గరే ఐబ్రోలు తీసుకునే మార్గాలు (freepik)

ఐబ్రో తీయించుకోడానికి బ్యూటీ పార్లర్ వెళ్లాల్సిందే. అయితే చాలా మందికి ప్రతిసారీ పార్లర్ వెళ్లడమంటే వీలుకాదు. ముఖ్యంగా కొంతమందికైతే ఐబ్రో తీసేటప్పుడు వచ్చే నొప్పి అంటేనే భయమేస్తుంది. ప్రతిసారీ ఆ నొప్పి భరించే అవసరం లేకుండా, పార్లర్ వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేకుండా ఇంట్లోనే కొన్ని బెస్ట్ మార్గాలు ఫాలో అవ్వచ్చు. అచ్చం పార్లర్ లాంటి ఫినిషింగే వస్తుంది. అవేంటో చూడండి. సులువుగా, నొప్పి లేకుండా ఐబ్రో షేపింగ్ అయిపోతుంది.

నొప్పి లేకుండా ఐబ్రో తీసుకునే మార్గాలు:

ఐబ్రో వ్యాక్సింగ్:

వ్యాక్సింగ్ అంటే వేడి వేడిగా ఉండే జెల్ పెట్టి టక్కుమని పీకక్కర్లేదు. కళ్ల దగ్గర ఇవి వాడితే ఇంకేం అయినా ఉందా.. బదులుగా ఇప్పుడు ప్రత్యేకంగా ఐబ్రో వ్యాక్సింగ్ స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. దాంతో మీ ఆకారానికి తగ్గట్లు ఐబ్రో పక్కల, మీదా స్టిక్కర్ లాగా అతికించి ఒకసారి లాగేస్తే ఐబ్రోలు మంచి ఆకారంలోకి వచ్చేస్తాయి.

ట్వీజింగ్:

ట్వీజర్లు వాడి ఐబ్రోకు ఆకారం తీసుకురావచ్చు. త్రెడింగ్ కన్నా ట్వీజర్ వాడితే నొప్పి తక్కువే అని చెప్పొచ్చు. వెంట్రుకలు పెరిగే దిశలోనే ట్వీజర్ వాడి ఒక్కో వెంట్రుక తీసేయొచ్చు. కాకపోతే కొన షార్ప్ గా ఉండేలా చూడాలి. దాంతో ఒక్కో వెంట్రుకను సులువుగా తీయొచ్చు.

ఐబ్రో స్టెన్సిల్స్:

కొంతమందికి కనుబొమ్మలు అంత మందంగా ఉండవు. చాలా తక్కువ వెంట్రుకలుంటాయి. కానీ వాటిని కూడా ఆకారంలోకి తీసుకురాడానికి పార్లర్ వెళ్లాల్సిందే. బదులుగా ఐబ్రో స్టెన్సిల్స్ వాడండి. వీటిని ఐబ్రో మీద అచ్చు లాగా పెట్టి ఐబ్రో పెన్సిల్ లేదా ఐషాడో వాడితే మంచి ఆకారం వస్తుంది. ముఖ్యంగా వేడుకలకు ఇవి బాగా పనికొస్తాయి. ఈ స్టెన్సిల్ వాడి ఒక ఆకారం వచ్చాక చుట్టూ ఏమైనా వెంట్రుకలుంటే ట్వీజింగ్ చేస్తే సరి.

ఐబ్రో రేజర్లు:

మామూలు బ్లేడ్ సాయంతో సరైన ఆకృతిలోకి తేవాలంటే భయంగా ఉంటుంది. బదులుగా ఐబ్రో రేజర్లు వాడొచ్చు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఐబ్రోలు తీయడానికే ప్రత్యేకంగా చేస్తారు వీటిని. చేతిలో పట్టుకుని అద్దం దగ్గరగా పెట్టుకుని సులువుగా షేప్ చేసుకోవచ్చు.

ఐబ్రో గ్రూమింగ్ కిట్స్:

ఈ కిట్స్ లో ఐబ్రో షేపింగ్ కోసం అవసరమయ్యేవన్నీ వస్తాయి. ఐబ్రో సిసర్స్, బ్రష్‌లు, బ్రో పౌడర్లు, పెన్సిల్ అన్నీ ఇస్తారు. వాటి సాయంతో చాలా సులువుగా ఎప్పటికప్పుడు షేప్ చేసుకోవచ్చు.

బ్రో జెల్స్:

ముందస్తు ప్లానింగ్ లేకుండా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే.. ఐబ్రో జెల్స్ ఉత్తమ మార్గం. ముందుగా పొడిగా ఉన్న మస్కారా బ్రష్ లేదా ఏదైనా చిన్న బ్రష్ తో కనుబొమ్మల్ని సరిగ్గా దువ్వి మంచి ఆకారంలోకి తీసుకురావాలి. మీద బ్రో జెల్ రాసుకోవాలి. వెంట్రుకలు కదలకుండా కనుబొమ్మలు మంచి ఆకారంలో కనిపిస్తాయి.

నంబింగ్ క్రీమ్:

ఎంతైనా చెప్పండి.. త్రెడింగ్ వల్ల వచ్చే ఫినిషింగ్ వేటితోనూ రాదు అనిపిస్తే మరొక మార్గం ఉంది. నొప్పి ఎక్కువగా రాకుండా నంబింగ్ క్రీమ్ రాసుకోవాలి. దాంతో కనుబొమ్మలు మొద్దుబారినట్లు అవుతాయి. వెంట్రుకలు త్రెడింగ్ చేస్తున్నా నొప్పి రాదు.

 

టాపిక్