100 steps after meals: తిన్న వెంటనే 100 అడుగులు వేస్తే మంచిదా? ఆయుర్వేదం ఏం చెబుతుందంటే..
100 steps after meals: తిన్న వెంటనే నడవాలని కొందరు, నడవొద్దని కొందరు చెబుతారు. ఇంతకీ ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకుందాం.
తిన్నవెంటనే నడిస్తే మంచిదా, లేదా కాసేపాగి నడవాలా? లేదా అసలు నడవొద్దా? ఇలా చాలా ప్రశ్నలుంటాయి. కానీ ఆయుర్వేదం ప్రకారం షట్‌పవలి ఆహారం జీర్ణం కావడానికి మంచి మార్గం. దీనివల్ల భోజనం తరువాత వచ్చే సోమరితనం పోతుంది. తిన్న తరువాత పదిహేను నిమిషాలు నడవడం ద్వారా ప్రయోజనం అని ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెబుతుంది.
ఆధునిక వైద్యం ఏం చెబుతుంది?
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జనలర్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం కడుపునొప్పి, ఎలాంటి అసౌకర్యం లేని వాళ్లు తిన్న వెంటనే వేగంగా నడవచ్చు. తిన్నవెంటనే అరగంట వేగంగా నడవటం ద్వారా బరువు తొందరగా తగ్గుతారని ఈ నివేదిక లో తెలిపింది.
షట్ పవలి అంటే?
కానీ ఆయుర్వేదం ప్రకారం వేగంగా నడవటం ఆరోగ్యకరం కాదు. కొవ్వు కరిగించడానికే నడక కాదని, వేగంగా నడవటం వల్ల శరీర దోషాలు పెరుగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. దీని ప్రకారం షట్‌పవలి ఆహారం జీర్ణం కావడానికి మంచి మార్గం. షట్ అంటే 100, పవలి అంటే అడుగులు. లంచ్ లేదా డిన్నర్ తరువాత నిదానంగా వంద అడుగులు వేస్తే మంచిదని అర్థం. వంద అడుగులు వేయడం లేదా పదిహేను నిమిషాలు నిదానంగా నడవటం మంచి మార్గం.
ఈ వంద అడుగుల వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి:
జీర్ణం:
ఆహారం జీర్ణం కావడానికి గ్యాస్ట్రిక్ జ్యూసులు, ఎంజైమ్స్ కావాలి. తిన్న వెంటనే నడవటం వల్ల ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభమై అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు కూడా రావు.
సోమరితనం:
తిన్న తరువాత మత్తుగా అనిపిస్తుంది. కాసేపు ఏ పనీ చేయాలనిపించదు. దానికి కారణం మనం తీసుకునే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అరిగించడానికి ఎక్కువగా సెరటోయిన్ ఉత్పత్తి కావడమే. తిన్నాక అడుగులు వేస్తే ఈ సమస్య రాదు.
బరువు తగ్గటం:
తిన్న తరువాత వంద అడుగులు వేయడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కేలరీలు కరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.