Acidity Control : వేసవిలో అసిడిటీ ఇబ్బంది పెడుతోందా.. ఇవి తింటే కంట్రోల్ అవుతుంది!-take these food to control acidity in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Acidity Control : వేసవిలో అసిడిటీ ఇబ్బంది పెడుతోందా.. ఇవి తింటే కంట్రోల్ అవుతుంది!

Acidity Control : వేసవిలో అసిడిటీ ఇబ్బంది పెడుతోందా.. ఇవి తింటే కంట్రోల్ అవుతుంది!

Chatakonda Krishna Prakash HT Telugu
May 16, 2023 03:26 PM IST

Acidity Control : అసిడిటీ కంట్రోల్‍లో ఉండేందుకు తినాల్సిన ఆహార పదార్థాలు ఏవో ఇక్కడ చూడండి. గుండెలో, కడుపులో మంట వీటి వల్ల తగ్గుతుంది.

Acidity Control : వేసవిలో అసిడిటీ ఇబ్బంది పెడుతోందా.. ఇవి తింటే కంట్రోల్ అవుతుంది! (Photo: Freepik)
Acidity Control : వేసవిలో అసిడిటీ ఇబ్బంది పెడుతోందా.. ఇవి తింటే కంట్రోల్ అవుతుంది! (Photo: Freepik)

Acidity: చాలా మంది అసిడిటీ (కడుపులో మంట) సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కొన్ని రకాల ఆహారాలు సరిగా అరగక అసిడిటీతో త్రేనుపులు వస్తుంటాయి. ఉప్పు, మసాలాలు, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, చీజ్, ఫ్యాటీ మీల్స్ తిన్నప్పుడు ఆసిడ్ రిఫ్లక్స్ (Acid Reflux) శరీరంలో ఏర్పడుతుంది. దీంతో అసిడిటీ సమస్య తలెత్తుతుంది. అయితే, కొన్ని రకాల ఆహారం తినడం వల్ల అసిడిటీని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

అరటి పండ్లు

Acidity Control - Banana: పొటాషియమ్ కోసం అరటి పండు చాలా బెస్ట్. అరటి పండు తింటే యాసిడ్ ఉత్పత్తి చాలా సమతుల్యంగా ఉంటుంది. అరటిలో పెక్సిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి.. ఆహారం అరిగేలా చేస్తుంది.

దోసకాయ

Acidity Control - Cucumber: దోసకాయలు కూడా క్షార సంబంధమైన ఆహారమే. దీంతో శరీరంలోని ఆమ్లాన్ని దోసకాయలు నియంత్రిస్తాయి. దోసకాయల్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే దోసకాయలు తింటే కూడా ఆసిటిటీ నియంత్రణలో ఉంటుంది.

సబ్జా గింజలు

Acidity Control - Sabja Seeds : సబ్జా గింజలు శరీరానికి సహజసిద్ధంగా చలువను చేస్తాయి. గుండెల్లో మంట, అసిడిటీని సబ్జా గింజలు తగ్గిస్తాయి. ఇబ్బందిని తొలగించి ఉపశమనం పొందడంలో సాయపడతాయి. నీటిలో సబ్జా గింజలను నానపెట్టినప్పుడు వాటిలోని జిగురు పెరుగుతుంది. మీ కడుపులో అధికంగా ఉండే యాసిడ్లను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే సబ్జా గింజలు కూడా అసిడిటీని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి.

అన్నం

Acidity Control : కడుపు తేలికగా ఉండేలా ఆహారం తీసుకోవాలనుకుంటే.. అన్నం, పాస్తా లాంటివి తినవచ్చు. అన్నం సులభంగా జీర్ణం అవుతుంది. బియ్యంలో ప్రీబయోటిక్ ఫైబర్ ఉండడం వల్ల గుండెల్లో మంట లాంటి ఇబ్బందిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దుంప కూరలు

Acidity Control - Root Vegetables : క్యారెట్, బీట్‍రూట్, బంగాళదుంపలు లాంటి దుంప కూరల్లో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, సులువుగా జీర్ణమయ్యే ఫైబర్లు ఉంటాయి. ఇవి తింటి గుండెల్లో మంట, అసిడిటీ లాంటి ఇబ్బందులు ఉండవు. అయితే, నూనె, మసాలాలతో వీటిని ఉడికించకూడదు.

Whats_app_banner