Bellam Chapathi: నెయ్యిలో కాల్చిన బెల్లం చపాతీ, పిల్లలకు నచ్చే రెసిపీ ఇది
Bellam Chapathi: పిల్లలకు తీయటి ఆహారాలను ఇష్టపడతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీయటి చపాతీలను పెట్టి చూడండి. వారికి నచ్చడం ఖాయం. ఇక్కడ మేము నెయ్యితో కాల్చిన బెల్లం చపాతీ రెసిపీ ఇచ్చాము.
Bellam Chapathi: బెల్లం చపాతీని ‘గుర్ కి రోటీ’ అని పిలుస్తారు. నెయ్యితో ఈ బెల్లం చపాతీని కాలిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. దీనిలో బెల్లం ఉపయోగిస్తాము కాబట్టి ఇనుము లోపం కూడా రాదు. ఒక్కసారి వాటిని వండి చూడండి మీకు నచ్చడం ఖాయం. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
బెల్లం చపాతీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - రెండు కప్పులు
మజ్జిగ - ఒక కప్పు
బెల్లం తురుము - అర కప్పు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - రెండు స్పూన్లు
బెల్లం చపాతీ రెసిపీ
1. గోధుమపిండిని ఒక గిన్నెలో వేసి చిటికెడు ఉప్పు, ఒక స్పూను నెయ్యి, ఒక కప్పు మజ్జిగ వేసి బాగా కలపాలి.
2. దీన్ని చపాతీ పిండిలా కలుపుకుని పైన మూత పెట్టి కాసేపు వదిలేయాలి.
3. పావుగంట తరువాత చిన్న చపాతీ ముద్దను తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి.
4. దీన్ని చిన్నగా ఒత్తుకుని బెల్లం తురుమును చల్లుకోవాలి.
5. మళ్లీ చపాతీని మడతబెట్టి ఒత్తుకోవాలి.
6. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి ఈ చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి.
7. అంతే బెల్లం తురుము రెడీ అయినట్టే. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది జీర్ణక్రియను సవ్యంగా సాగేలా చేస్తుంది. ప్రతిరోజూ చిన్న ముక్క బెల్లం తింటే ఎన్నో సమస్యలు శరీరానికి రాకుండా ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లెమ్ తో బాధపడే వారు బెల్లాన్ని తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. బెల్లంలో ఇనుము, ఫైబర్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది పోషకాహారం జాబితాలోకే వస్తుంది.