Kids and AI: పేరెంట్స్ చెప్పని జవాబుల కోసంఅలెక్సాను కోట్ల కొద్దీ ప్రశ్నలు అడిగేస్తున్న పిల్లలు.. విచిత్ర ప్రశ్నలు ఇవే-amazon alexa survey on parents says that kids asking millions questions to clear their doubts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids And Ai: పేరెంట్స్ చెప్పని జవాబుల కోసంఅలెక్సాను కోట్ల కొద్దీ ప్రశ్నలు అడిగేస్తున్న పిల్లలు.. విచిత్ర ప్రశ్నలు ఇవే

Kids and AI: పేరెంట్స్ చెప్పని జవాబుల కోసంఅలెక్సాను కోట్ల కొద్దీ ప్రశ్నలు అడిగేస్తున్న పిల్లలు.. విచిత్ర ప్రశ్నలు ఇవే

Koutik Pranaya Sree HT Telugu
Aug 05, 2024 05:00 PM IST

Kids and AI: అమెజాన్, కాంటార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త సర్వే పిల్లలు అడిగే అత్యంత సాధారణ ప్రశ్నలను, ఇంట్లో అలెక్సా ప్రభావం గురించి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో వెల్లడించింది. ఆ వివరాలన్నీ తెల్సుకోండి.

అలెక్సాను ప్రశ్నలు అడిగేస్తున్న పిల్లలు
అలెక్సాను ప్రశ్నలు అడిగేస్తున్న పిల్లలు

పిల్లల మెదడులో బోలెడు ప్రశ్నలుంటాయి. తల్లిదండ్రుల వద్ద వాటికి సరైన సమాధానాలు లేనప్పుడు కృత్రిమ మేధనూ(ఏఐ) పిల్లలు వాడేస్తున్నారు. జూన్ 2024 లో ఆరు నగరాల్లోని 750+ పేరెంట్స్ మీద అమెజాన్ అలెక్సా ఒక అధ్యయనం నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 54 శాతం మంది పిల్లల ప్రశ్నలకు తక్షణ సమాధానాలు చెప్పలేకపోతున్నారు. 52 శాతం మంది తమకు సమాధానం తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్‌లో వెతికి కరెక్ట్ గా సమాధానం చెబుతున్నారట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సర్వేలో పాల్గొన్న 44% మంది తల్లిదండ్రులు అక్కడికక్కడే సమాధానాలు ఇచ్చినట్లు అంగీకరించారు. కేవలం 3% మంది మాత్రమే ప్రశ్నను పట్టించుకోకుండా ఉంటున్నారట. లేదంటే ఏదైనా వేరే విషయం మాట్లాడి ప్రశ్న అడగకుండా చేస్తున్నారట.

ఏం ప్రశ్నలు?

"కారును ఎలా తయారు చేయాలి?", "విశ్వం ఎంత పెద్దది?", "విమానం ఎలా ఎగురుతుంది?", "నీటి కింద చేపలు ఎలా శ్వాస తీసుకుంటాయి?", మొదలైనవి పిల్లలు అడిగే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. "శీతాకాలం మరియు వేసవి మధ్య ఏ కాలం వస్తుంది?", "తల్లిదండ్రులు ఎందుకు పని చేయాలి?", "కూరగాయలను ఎందుకు కడగాలి?" వంటి సులభమైన ప్రశ్నలను పిల్లలు అడిగినప్పుడు 60% మంది తల్లిదండ్రులు తరచుగా ఉలిక్కిపడుతున్నామని చెప్పారు. 37% మంది తమ పిల్లలను వారి ప్రశ్నలకు సమాధానం కోసం వాళ్ల భాగస్వామి దగ్గరికి పంపుతామని చెప్పారు.

టీవీ చూస్తున్నప్పుడు ఎక్కువ ప్రశ్నలు:

ఈ అధ్యయనం పిల్లలకు ప్రశ్నలడగటంలో ఉండే కుతూహలం గురించి మరింత లోతుగా పరిశీలించింది.దీనిలో 63% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు మరింత ఆసక్తిగా ప్రశ్నలు అడుగుతారని వెల్లడించారు. ప్రయాణాల్లో (57%), చదువుకునేటప్పుడు (56%), బయటి కార్యకలాపాలు (55%), గ్యాడ్జెట్లలో కంటెంట్ చూడటం (52%), పెద్దల సంభాషణలు వినడం (50%).. ఈ అయిదు పనులు చేస్తున్నప్పుడు పిల్లల్లో ఉత్సుకత పెరిగి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారట. అంతేకాకుండా ఆహారం, జంతువులు, ప్రకృతి, జనరల్ నాలెడ్జ్, హాలిడేస్, టెక్నాలజీ, సినిమాలు వంటి అంశాల గురించి పిల్లలు ఎక్కువగా ప్రశ్నలు వేస్తుంటారు.

80 శాతానికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది. అలెక్సాతో సహా వాయిస్ ఏఐ సేవలు దీనికి సహాయపడతాయి. 

అలెక్సా పరిశోధన
అలెక్సా పరిశోధన

నెలకు 25 మిలియన్ల ప్రశ్నలు:

"ఆకస్మిక ప్రశ్నలు అడగడం నుండి వారి వయస్సుకు అనుగుణంగా ఎక్కువ జ్ఞాన ఆధారిత లేదా అసాధారణమైన ప్రశ్నల వరకు, పిల్లలు ఆసక్తిగా ఉంటారు. వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి సమాధానాల వేటలో ఉంటారు. తల్లిదండ్రులు తమ ప్రశ్నలకు అర్థం చేసుకొని వాళ్ల వయసుకు తగ్గే విధంగా సమాధానం సులభంగా ఇవ్వడం ముఖ్యం." అని అమెజాన్ ఇండియా అలెక్సా కంట్రీ మేనేజర్ దిలీప్ ఆర్.ఎస్. అన్నారు. "నేడు, ప్రపంచవ్యాప్తంగా, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు అలెక్సాను నెలకు 25 మిలియన్ల ప్రశ్నలు అడుగుతున్నాయి - అలెక్సా తల్లిదండ్రులకు సమాచార, అభ్యాస కేంద్రంగా మారడానికి ఇది నిదర్శనం. ఇది ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోవడంలో వారికి సహాయపడుతుంది, అదే సమయంలో సరదాగానూ ఉంటుంది.

ఎక్కువ ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తారు:

90% కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలు కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. దాదాపు 92% మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో కొత్త విషయాలు నేర్చుకుంటామని చెప్పారు.