Winter Driving Tips : శీతాకాలంలో డ్రైవింగ్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి-how to drive car and bike in winter every one must follow these driving tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Driving Tips : శీతాకాలంలో డ్రైవింగ్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Winter Driving Tips : శీతాకాలంలో డ్రైవింగ్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Anand Sai HT Telugu Published Jan 12, 2024 01:50 PM IST
Anand Sai HT Telugu
Published Jan 12, 2024 01:50 PM IST

Winter Driving Tips In Telugu : సంక్రాంతికి చాలా మంది ఊరెళ్తుంటారు. చలికాలం కావడంతో డ్రైవింగ్ చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి.

డ్రైవింగ్ చిట్కాలు
డ్రైవింగ్ చిట్కాలు (unsplash)

శీతాకాలంలో పొగమంచులో డ్రైవింగ్ చేయడం కాస్త కష్టమే. సంక్రాంతి కావడంతో పట్టణాల నుంచి ఊరికి వెళ్తుంటారు. అయితే చాలా మంది ఉదయంపూట లేదా రాత్రుళ్లు ప్రయాణం చేసేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ పొగమంచు కాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడానికి అనుసరించాల్సిన కొన్ని పద్ధతలు మీకోసం ఇక్కడ ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఉదయంపూట పొగమంచు విపరీతంగా వస్తుంది. పట్టణాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సిటీ దాటితే పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో హైవేల మీద డ్రైవింగ్ చేయడం కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడం అంత తేలికైన పని కాదు. వివిధ ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలపై ప్రయాణించడం సవాలుతో కూడిన పని.

ప్రస్తుతం వాహనాలకు ఫాగ్ లైట్లు ఉంటున్నాయి. ముఖ్యంగా పొగమంచు పరిస్థితులలో ఉపయోగం కోసం రూపొందించారు. ముందు, వెనుక బంపర్‌ల దిగువ భాగంలో ఉంటాయి. ఈ ఫాగ్ లైట్లు పొగమంచు పరిసరాలలో స్పష్టమైన మార్గాన్ని చూపుతాయి.

హెడ్‌ల్యాంప్‌లను వాడుతూ ఉండాలి. హెడ్‌ల్యాంప్‌లు పొగమంచులో కనిపించేలా చేస్తాయి. తెల్లటి LED హెడ్‌ల్యాంప్‌లు, హై బీమ్‌లతో జాగ్రత్త. కాంతి చెల్లాచెదురుగా ఉంటుంది. హెడ్‌ల్యాంప్‌లతో పాటు, టెయిల్ ల్యాంప్‌లు కూడా స్విచ్ ఆన్ చేసి పెట్టాలి. వెనుక వాహనాలకు లైట్‌గా పనిచేస్తాయి.

మీ ముందు వచ్చే వాహనాలతో సురక్షితమైన దూరం పాటించాలి. ముందుకు వెళ్లే మార్గాన్ని అర్థం చేసుకోవడానికి, వారికి, మీకు మధ్య సురక్షితమైన దూరాన్ని ఉంచుకోవాలి. ముందు ఉన్న వాహనాల టెయిల్ లైట్లను అనుసరించడానికి ప్రయత్నించండి.

పొగమంచు వాతావరణంలో వేగంగా నడపడం మానుకోండి. మీ ప్రయాణ సమయం కొద్దిగా పెరిగినప్పటికీ, ప్రమాదం ఉండదు.

మీ విండ్‌షీల్డ్ వైపర్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయని చెక్ చేసుకోవాలి. మీ దృష్టిని స్పష్టంగా ఉంచడానికి వాటిని ఉపయోగించండి. అలాగే విండ్‌షీల్డ్ లోపలి భాగంలో ఫాగింగ్‌ను నివారించడానికి డీఫ్రాస్టర్‌లను ఆన్ చేయండి.

పొగమంచు పరిస్థితుల్లో లేన్ మార్పులు, దూకుడు డ్రైవింగ్‌ను తగ్గించుకోవాలి. ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది మంచి పద్ధతి.

రహదారి చిహ్నాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు ట్రాక్‌లో ఉండేలా చూసుకోండి. ఒక్కోసారి వేరే మార్గంలో వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

మీరు వెళ్లాలనుకుంటున్న మార్గాన్ని తెలుసుకోండి. వీలైతే పొగమంచు వాతావరణంలో బాగా కాంతి ఉండే మార్గాలను ఎంచుకోండి.

హెవీ వెహికల్స్ ను ఓవర్ టెక్ చేసేప్పుడు జాగ్రత్త. డివైడర్ చూసుకోండి. నిద్ర మత్తు ఉన్నప్పుడు అవసరమైతే కాసేపు ఆగి రెస్ట్ తీసుకుని డ్రైవింగ్ మెుదలుపెట్టండి.

వాతావరణ సూచనలు నిశితంగా గమనించండి. ముఖ్యంగా శీతాకాలం అంతా పొగమంచు పరిస్థితుల గురించి తెలుసుకోండి. పండగ సమయంలో ప్రమాదాలను నివారించండి.

ఫ్లాష్‌లైట్, ప్రథమ చికిత్స సామాగ్రి, పూర్తిగా ఛార్జ్ చేయబడిన మొబైల్ ఫోన్ వంటి అవసరమైన వాటిని పెట్టుకోండి. వాటితో సహా మీ వాహనంలో ఎల్లప్పుడూ ఎమర్జెన్సీ కిట్ ఉండేలా చూసుకోండి. ఈ వస్తువులు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి.

Whats_app_banner