WhatsApp: ఈ కొత్త ఫీచర్ తో వాట్సాప్ లో మెటా ఏఐ ని చాలా ఈజీగా ఉపయోగించవచ్చు..-whatsapp to make it easier to use meta ai with this new feature check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: ఈ కొత్త ఫీచర్ తో వాట్సాప్ లో మెటా ఏఐ ని చాలా ఈజీగా ఉపయోగించవచ్చు..

WhatsApp: ఈ కొత్త ఫీచర్ తో వాట్సాప్ లో మెటా ఏఐ ని చాలా ఈజీగా ఉపయోగించవచ్చు..

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 06:10 PM IST

WhatsApp: మెటా ఏఐ కోసం వాట్సాప్ కొత్త వాయిస్ మెసేజ్ ఫీచర్ ను పరీక్షిస్తోంది. రాబోయే నెలల్లో వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు మెటా ఏఐను చాలా సులభంగా ఉపయోగించవచ్చు.

వాట్సాప్ లో మెటా ఏఐ కొత్త ఫీచర్
వాట్సాప్ లో మెటా ఏఐ కొత్త ఫీచర్ (AP)

దైనందిన జీవితంలో వినియోగదారులకు తమ తాజా చాట్ బాట్లను టాప్ ఛాయిస్ గా మార్చడానికి టెక్ దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఓపెన్ఏఐకి చెందిన చాట్ జీపీటీ (chatGPT), గూగుల్ (GOOGLE) కు చెందిన జెమిని టాప్ ప్లేస్ లో ఉండగా, మెటా కూడా క్రమంగా తన సోషల్ మీడియా యాప్స్ అయిన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ లలో మెటా ఏఐని చేర్చడం ద్వారా పోటీలో దూసుకుపోతోంది. తమ పాపులర్ ప్లాట్ ఫామ్స్ లో వినియోగదారులు మెటా ఏఐ చాట్ బాట్ తో సులభంగా ఇంటరాక్ట్ అయ్యేలా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

yearly horoscope entry point

వాట్సాప్ వాయిస్ చాట్ ఆప్షన్

ఏఐ చాట్ బాట్స్ కోసం సుదీర్ఘమైన, బోరింగ్ ప్రాంప్ట్ లను టైప్ చేయడానికి ఇష్టపడని అసహన యూజర్లు చాలా మంది ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మెటా ఇటీవల వాట్సాప్ బీటాలో తాజా ఆండ్రాయిడ్ వెర్షన్ (2.24.16.10) కోసం ఒక ఫీచర్ ను విడుదల చేసింది, ఇది వాట్సాప్ (WHATSAPP) లో వినియోగదారులు వాయిస్ సందేశాల ద్వారా మెటా ఏఐతో సంభాషించవచ్చు. అంటే తమకు కావాల్సిన వివరాల కోసం వాయిస్ మెసేజ్ ద్వారా మెటా ఏఐ ను ప్రశ్నించవచ్చు. ఇంతకుముందు యూజర్లు టెక్స్ట్, వీడియో ద్వారా మాత్రమే ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో మెటా ఈ కొత్త వాయిస్ ఫీచర్ పై దృష్టి సారించింది.

వాయిస్ మెసేజ్ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలి?

వాట్సాప్ లోని ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించి చేసిన సంభాషణ గ్లింప్స్ స్క్రీన్ షాట్ ను మెటా పంచుకుంది. మెటా ఏఐ ఇంటర్ ఫేస్ లో కుడివైపున కనిపించే వాయిస్ మెసేజ్ ఆప్షన్ ను ఆ ఇమేజ్ చూపిస్తుంది. చాట్ బాట్ తో వాయిస్ సందేశాల ద్వారా సంభాషించడం సాధారణ డిస్కషన్ మాదిరిగానే ఉంటుందని ఈ డిస్ ప్లే సూచిస్తుంది.

ఏయే భాషల్లో..

మెటా ఏఐ కొత్త వాయిస్ మెసేజ్ ఫీచర్ ఏయే భాషల్లో పనిచేస్తుందనే వివరాలను మెటా ఇంకా వెల్లడించలేదు. కానీ, దక్షిణాసియా దేశాలలో దాని విస్తృత కస్టమర్ బేస్ ను పరిగణనలోకి తీసుకొని ఆయా పాపులర్ భాషల్లో ఈ సేవలను మెటా అందించే అవకాశం ఉందని అంచనా. ఈ కొత్త వాయిస్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ ల ద్వారా మనం అడిగిన ప్రశ్నలకు సందేశాలకు సమాధానం ఎలా ఇస్తుందనే విషయంపై కూడా స్పష్టత లేదు. నేరుగా సమాధానం ఇస్తుందా? లేక, సంబంధిత వెబ్ పేజ్ లను డిస్ ప్లే చేస్తుందా? అనే విషయంపై మెటా ఇంకా ఏ వివరాలు వెల్లడించలేదు. ఈ వివరాలు లాంచ్ అయిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం, వాయిస్ మెసేజ్ ఫీచర్ ను పరిమిత బీటా టెస్టర్ ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వినియోగదారులు దీనిని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది.

Whats_app_banner