Samsung Galaxy Book4 Ultra: శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా భారత్ లో విడుదల అయింది. శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా విడుదలతో భారతదేశంలో టాప్ ఎండ్ ల్యాప్ టాప్ ల శ్రేణిని శ్యామ్సంగ్ విస్తరించింది. ఈ బుక్ 4 అల్ట్రా లో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 లేదా 7 చిప్ సెట్స్ ఉంటాయి. ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ గ్రాఫిక్స్ తో ఇది వస్తుంది. ఇందులో 1 టీబీ వరకు స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. అదనపు భద్రత కోసం శామ్సంగ్ నాక్స్ చిప్, 3కే రిజల్యూషన్ తో డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే , శాంసంగ్ ఎకోసిస్టమ్ ఫీచర్లు ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. ఇది వినియోగదారులు వారి ఫోన్లు మరియు టాబ్లెట్లను కనెక్ట్ చేయడానికి, వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 32 జీబీ ర్యామ్ తో, మరొకటి 16 జిబి ర్యామ్ తో లభిస్తుంది. ఈ శ్యామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ Samsung.com తో పాటు ఎంపిక చేసిన ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభ్యం కానుంది. దీని ధర రూ.2,33,990గా నిర్ణయించారు. ఇది 16 అంగుళాల స్క్రీన్ సైజ్ తో, మూన్ స్టోన్ గ్రే ఫినిష్ తో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా (Samsung Galaxy Book4 Ultra) ఇంటెల్ కోర్ అల్ట్రా 9 లేదా 7 ప్రాసెసర్లతో పనిచేస్తుంది. ఆర్టీఎక్స్ 4070 లేదా ఆర్టీఎక్స్ 4050 జీపీయూలలో 32 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు. 16 అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ డిస్ ప్లే తో, 3కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లభిస్తుంది. అదనంగా, ఇందులో ఏకేజీతో ట్యూన్ చేయబడిన క్వాడ్-స్పీకర్ సెటప్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. అంతరాయం లేని వీడియో కాల్స్ కోసం బై-డైరెక్షనల్ నాయిస్-క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ను కూడా కలిగి ఉంది. ఇందులో హెచ్డీఎంఐ 2.1, యూఎస్బీ 3.2 పోర్టు, రెండు థండర్బోల్ట్ 4 పోర్టులు, మైక్రోఎస్డీ స్లాట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. 140 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ను ఉపయోగించి త్వరితగతిన ఛార్జ్ చేయగలిగే 76 వాట్ బ్యాటరీ సెల్ ను శాంసంగ్ ఈ డివైస్ లో అమర్చింది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ టచ్ కంపాటబుల్ ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంది.