No Recharge : ఎయిర్‌టెల్ రీఛార్జ్ లేకుండానే అన్‌లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా.. ఆ కస్టమర్లకు బిగ్ రిలీఫ్-airtel announces unlimited calls and free 1gb data in wayanad 30 day bill payment extension and other ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  No Recharge : ఎయిర్‌టెల్ రీఛార్జ్ లేకుండానే అన్‌లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా.. ఆ కస్టమర్లకు బిగ్ రిలీఫ్

No Recharge : ఎయిర్‌టెల్ రీఛార్జ్ లేకుండానే అన్‌లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా.. ఆ కస్టమర్లకు బిగ్ రిలీఫ్

Anand Sai HT Telugu
Aug 01, 2024 08:43 AM IST

Airtel Recharge : కేరళలోని వాయనాడ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఎయిర్‌టెల్ అక్కడ చందాదారులకు ఉపశమనం కలిగించడానికి అదనపు వాలిడిటీ, ఉచిత డేటా, కాలింగ్‌ను అందిస్తోంది.

ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్

టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ అదనపు వాలిడిటీ, డేటా, కాలింగ్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యం తర్వాత కేరళలోని వాయనాడ్‌లో ఉన్న ఎయిర్‌టెల్ చందాదారులకు ఈ ఉపశమనం లభించింది. కేరళలోని వాయనాడ్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

వాయనాడ్‌లో సంభవించిన భారీ విపత్తు కారణంగా వేలాది మంది ప్రభావితమయ్యారని, ఈ విపత్తు బాధిత చందాదారులకు ఎలాంటి రీఛార్జ్ లేదా రుసుము లేకుండా అదనపు ప్రయోజనాలను అందించాలని ఎయిర్‌టెల్ నిర్ణయించింది. అయితే ఈ ప్రయోజనాలు కేవలం ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ చందాదారులకు రీఛార్జ్ పూర్తయిన తర్వాత కూడా అదనపు వ్యాలిడిటీ, డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఇస్తామని కంపెనీ తెలిపింది.

వాయనాడ్‌లోని ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ చందాదారులకు రీఛార్జ్ పూర్తయిన తరువాత అదనపు వాలిడిటీ ఇస్తారు. అంటే విపత్తులో చిక్కుకుని రీఛార్జ్ చేసుకోలేని వారు ఇప్పుడు కాల్స్, ఇంటర్నెట్ ద్వారా కూడా మిగిలిన వారితో కనెక్ట్ కావచ్చు. 3 రోజుల అదనపు వాలిడిటీతో పాటు 1 జీబీ మొబైల్ డేటా, అపరిమిత కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ సేవలను ఉపయోగించే చందాదారులకు బిల్లు చెల్లింపు గడువును 30 రోజులు పొడిగించారు. అంటే ఇప్పుడు చెల్లించకుండానే మరో నెల రోజుల పాటు తమ సేవలను వినియోగించుకోవచ్చు. దీని తరువాత వారు తదుపరి గడువులో ఒకేసారి రెండు నెలలు చెల్లించే అవకాశం లభిస్తుంది.

గత నెలలో ఎయిర్‌టెల్ తన రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనదిగా చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, విపత్తు సంభవించినప్పుడు వినియోగదారులకు ఉపశమనం కలిగించడం సానుకూల చర్య. కష్టకాలంలో చందాదారులకు సహాయం చేయడానికి కంపెనీ ఇలా చేస్తోంది.

మరోవైపు వాయనాడ్‌లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 150 మందికిపైగా కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతి చెందారు. కొన్ని మృతదేహాలు నదిలో కొట్టుకుపోయినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

Whats_app_banner