Wayanad Landslides In Pics : వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. పెరుగుతున్న మరణాల సంఖ్య!-kerala wayanad landslides in pics death toll may increase dozens still missing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wayanad Landslides In Pics : వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. పెరుగుతున్న మరణాల సంఖ్య!

Wayanad Landslides In Pics : వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. పెరుగుతున్న మరణాల సంఖ్య!

Published Jul 30, 2024 12:32 PM IST Anand Sai
Published Jul 30, 2024 12:32 PM IST

  • Wayanad Landslides : కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో 100కు పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి.

కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు బురదలో కూరుకుపోయాయి. చాలా మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు.

(1 / 6)

వాయనాడ్ లో ఒక్కరోజే 300 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. జూలై 30 వయనాడ్ సహా కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(2 / 6)

వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యల్లో అన్ని విధాలా సహకరిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

(3 / 6)

వాయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయని తెలిసి చాలా బాధపడ్డానని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని యూడీఎఫ్ వాలంటీర్లను కోరుతున్నాను అని ట్వీట్ చేశారు.

(4 / 6)

ఈ ఘటనను కేరళ ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావించారు. కేరళను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దీనిపై పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

(5 / 6)

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 30 మంది సభ్యుల బృందాన్ని బెంగళూరు నుంచి వాయనాడ్‌కు తరలించారు. వాయనాడ్‌లో సహాయం అందించడానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం అవసరమైన వారు 9656938689, 8086010833 అనే రెండు నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చని కేరళ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు