Whatsapp | వాయిస్ మెసేజ్‌నే అని ఓపెన్ చేశారో.. బ్యాంక్ ఖాతా ఖాళీ అయినట్లే..
స్కామర్‌లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి వాట్సాప్ వాయిస్ నోట్‌లను వినియోగిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. కాబట్టి మీరు వాట్సాప్‌ను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త సమస్య గురించి తెలుసుకుని మీరు కూడా జాగ్రత్త పడండి.

(1 / 6)
సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆర్మోర్‌బ్లాక్స్‌లోని నిపుణులు ఇటీవలె ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రైవేట్ వాట్సాప్ వాయిస్ నోట్‌తో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని స్పష్టం చేశారు. (Pixabay)
(2 / 6)
వాయిస్ నోట్‌తో సైబర్ నేరగాళ్లు మాల్వేర్‌ను పంపిస్తారు. మీరు వాయిస్ నోట్‌ను క్లిక్ చేయగానే.. అది మిమ్మల్ని వెబ్‌పేజీకి తీసుకువెళ్తుంది. వెంటనే అది మీ ఫోన్లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. దీనివల్ల మీ ఆర్థికపరమైన ఆధారాలు బహిర్గతమవుతాయి. (HT_Print)
(3 / 6)
ఈ మెసేజ్ సాధారణంగా 'కొత్త ఇన్‌కమింగ్ వాయిస్ మెసేజ్' పేరుతోనే ఉంటుంది. ఇప్పటికే 28,000 కంటే ఎక్కువ మంది వాట్సాప్ ఇన్‌బాక్స్‌లకు ఇది చేరినట్లు గుర్తించారు. (Reuters)
(4 / 6)
ఆరోగ్య సంరక్షణ, విద్య, రిటైల్ సంస్థలను లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఫిల్టర్‌లను కూడా ఇవి సులభంగా దాటేస్తున్నాయి. (Pixabay)
(5 / 6)
ఈ దాడుల బారిన పడకుండా ఉండడానికి.. మీరు మీ పరికరంలో భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అనుమానాస్పద ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపే సందేశాలను లేదా తెలియని పేర్లతో వచ్చే సందేశాలను తెరవకుండానే బ్లాక్ చేసేయండి. (Bloomberg)
ఇతర గ్యాలరీలు