Weight Loss Tips : వ్యాయామానికి ముందు ఉప్పు తింటే ప్రయోజనాలు ఉన్నాయా?
Weight Loss and Salt : బరువు తగ్గేందుకు కొంతమంది బాగా కష్టపడాల్సి వస్తుంది. అయితే వ్యాయామానికి ముందు ఏం తినాలి? ఏం తినకూడదు? లాంటి అనుమానాలు వస్తుంటాయి.
Weight Loss and Salt : బరువు తగ్గడానికి వ్యాయామం మాత్రమే ముఖ్యమైన అంశం కాదు. దీనితో పాటు మనం ఎలాంటి ఆహారం(Food) తీసుకుంటాం అనేది కూడా చాలా ముఖ్యం. వ్యాయామానికి ముందు, వ్యాయామం(exercise) చేసిన తర్వాత కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా, ఉప్పు బరువు తగ్గడానికి(Weight Loss) సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఉప్పు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం..
వ్యాయామానికి ముందు కొన్ని ఆహారాలు(Foods) తినడం వల్ల మన వ్యాయామం నాణ్యతను మెరుగుపరుస్తుంది. పరిగెత్తే ముందు అరటిపండ్లు, బాదంపప్పులు, ఇతర పదార్థాలను తినడం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఉప్పు కూడా వ్యాయామం చేయడానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది. వ్యాయామానికి ముందు కొద్దిగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.
తీవ్రమైన వ్యాయామం ద్వారా హైడ్రేషన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. నీటితో పాటు చెమట, మూత్రం, ఇతర శరీర ద్రవాల ద్వారా మనం పోషకాలను కోల్పోతాము. కాబట్టి నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగడం వల్ల శరీరంలో ఉప్పు నిల్వ ఉంటుంది. శరీర ద్రవాల సమతుల్యతను సరిగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసే సమయంలో నీటిలో ఉప్పు కలపడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరమంతా రక్త ప్రసరణను పెంచుతుంది. ఉప్పు కలిపిన నీటిని తాగడం వల్ల వ్యాయామానికి మరింత శక్తి లభిస్తుంది.
శరీరంలో ఉప్పు ఉంటే, వ్యాయామం చేసే సమయంలో శరీరం పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. తీవ్రమైన వ్యాయామం కోసం ఎక్కువ శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉంటుంది. చాలా మంది అథ్లెట్లు తమ ప్రదర్శనకు ముందు సోడియం తీసుకుంటారు. ఎందుకంటే ఇది శరీరంలో ఓర్పును పెంచుతుంది.
వ్యాయామం చేసేటప్పుడు రక్త ప్రసరణ పెరగడం వల్ల కండరాల తిమ్మిర్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరంలో నిర్జలీకరణం, ఉప్పు లేకపోవడం కండరాల ఇంటర్ సెల్యులార్ ఖాళీలను తగ్గిస్తుంది. నరాల చివరలపై ఒత్తిడిని పెంచుతుంది. నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి వ్యాయామానికి ముందు నీటిలో ఉప్పు కలిపి తీసుకోవడం మంచిది. వ్యాయామానికి ముందు కొద్దిగా ఉప్పు తీసుకోవడం మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తక్కువ మెుత్తంలో తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా.. ఈ కథనం ఇచ్చాం. ఏదైనా పాటించముందే.. వైద్యుడిని సంప్రదించండి.
సంబంధిత కథనం