Medicine and Food : టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఈ ఆహారాలు తీసుకోవద్దు
ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ తెలియకుండానే చిన్నచిన్న తప్పులు జరుగుతాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకునే సమయంలో తినే ఆహారం సరిగా ఎంచుకోకపోవడం కూడా తప్పే.
ఆరోగ్యంగా జీవించడానికి.. ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాథమిక మంత్రం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లి.. సలహా మేరకు మందులు తీసుకుంటారు. అయితే టాబ్లెట్ వేసుకునే సమయంలో ఏది పడితే అది మాత్రం తినకండి.
మందులు వాడితేనే జబ్బులు నయమవుతాయని అనుకుంటే అది పూర్తిగా తప్పు. మందులు(Medicine) తీసుకునేటప్పుడు, మీరు తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మందులతో పాటు తీసుకునే ఆహారం దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉంది. మెడిసిన్ తీసుకునేటప్పుడు దూరంగా ఉండవలసిన ఆహారాల గురించి ఇక్కడ చదవండి.
మీరు మందులు తీసుకున్నప్పుడు, దానితో పాటు ఎనర్జీ డ్రింక్స్(Energy Drinks) తీసుకోకుండా ఉండండి. ఎనర్జీ డ్రింక్స్‌తో మందులు తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మందు కూడా కరిగిపోవడానికి చాలా సమయం పడుతుంది.
టాబ్లెట్(Tablets) తీసుకునేటప్పుడు ఆల్కహాల్(alcohol) వినియోగం లేదా ఏ రకమైన డ్రగ్స్‌కు అయినా పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది ఆరోగ్యం(health)పై చెడు ప్రభావం చూపడమే కాకుండా, రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కాలేయానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఆల్కహాల్‌తో మందులు తీసుకోవడం వల్ల కాలేయానికి అనేక ప్రమాదాలు వస్తాయి.
పాల(Milk)తో మందులు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పాలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. పాలలో కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్లు వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఔషధాలతో కలిపి వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే పాల ఉత్పత్తులతో మందులను తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ములేటి(mulethi).. ఆయుర్వేదంలో అత్యంత ఉపయోగకరమైన మూలికలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా అనేక పొట్ట సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇందులో ఉండే 'గ్లైసిరైజిన్' అనే సమ్మేళనం అనేక ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వ్యాధులు త్వరగా నయం కావు.
సంబంధిత కథనం