Diabetes: డయాబెటిస్ ఉన్న వారు తినకూడదని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ, రక్తంలో చక్కెరను పెంచేస్తాయి-all these dry fruits which increase blood sugar should not be eaten by people with diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉన్న వారు తినకూడదని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ, రక్తంలో చక్కెరను పెంచేస్తాయి

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు తినకూడదని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ, రక్తంలో చక్కెరను పెంచేస్తాయి

Haritha Chappa HT Telugu
Aug 03, 2024 01:07 PM IST

Diabetes: మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే, పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు. ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.

డయాబెటిస్ వారు తినకూడని డ్రైఫ్రూట్స్
డయాబెటిస్ వారు తినకూడని డ్రైఫ్రూట్స్ (shutterstock)

హెల్తీ డైట్ అనగానే అందులో కచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అయితే డయాబెటిక్ పేషెంట్లకు నట్స్, డ్రైఫ్రూట్స్ తినమని చెబుతారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్న వారు మాత్రం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి. చాలా డ్రై ఫ్రూట్స్ లో సహజ చక్కెర ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచుతుంది. ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్లు పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ షుగర్ లెవల్స్ వేగంగా పెరగకూడదనుకుంటే ఈ 8 రకాల డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో డయాబెటిస్ వారు చేర్చుకోకూడదు.

yearly horoscope entry point

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో చాలా పోషకాలు ఉంటాయి, సాధారణ వ్యక్తులకు ఇవి మంచివి. కానీ డయాబెటిస్ విషయానికి వస్తే, ఇందులో ఉండే అధిక స్థాయి సహజ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి ఎండుద్రాక్ష తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

ఖర్జూరాలు

డయాబెటిస్ రోగులకు సహజ తీపిని ఇవ్వడానికి ఖర్జూరాలను తరచుగా ఉపయోగిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందులో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అకస్మాత్తుగా పెంచుతుంది. డయాబెటిస్ స్థాయి ఎక్కువగా ఉన్న రోగులు ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాలను తినకపోవడమే మంచిది.

అంజీర పండ్లు

అంజీర పండ్లలో నేచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో రక్తంలో చక్కెరను పెంచుతుంది. అందువల్ల, డయాబెటిస్ ఉన్నవారు కూడా అత్తి పండ్ల లేదా అంజీర పండ్లును తినడం మానుకోవాలి. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా డయాబెటిస్ ఉన్న వారికి ఇవి ఎంతో కీడు చేస్తాయి.

డ్రై క్రాన్బెర్రీస్

డ్రై ఫ్రూట్లలో ఎండు క్రాన్బెర్రీస్ కూడా భాగమే. ఇవి మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి మూత్రానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. కానీ డయాబెటిక్ పేషెంట్లు మాత్రం ఈ పండ్లను తినకూడదు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. వీటిని తీసుకుంటే పంచదారను తిన్నట్టే లెక్క.

నేరేడు పండ్లు, రేగు పండ్లు

ఎండు నేరెడు, ఎండు రేగు పండ్లు…డ్రై ఫ్రూట్స్ గా కూడా లభిస్తాయి. వీటి రుచి కూడా బావుంటుంది. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది కాదు. కాబట్టి ఎండు డ్రై ఫ్రూట్స్ ఏవి తినాలో, ఏవి తినకూడదో డయాబెటిస్ పేషెంట్లు నిర్ణయించుకోవాలి.

Whats_app_banner