Oats Poha: డయాబెటిస్ పేషెంట్ల కోసం ప్రొటీన్ నిండి వోట్స్ పోహా రెసిపీ, దీన్ని చేయడం చాలా సులువు-oats poha recipe for diabetics know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Poha: డయాబెటిస్ పేషెంట్ల కోసం ప్రొటీన్ నిండి వోట్స్ పోహా రెసిపీ, దీన్ని చేయడం చాలా సులువు

Oats Poha: డయాబెటిస్ పేషెంట్ల కోసం ప్రొటీన్ నిండి వోట్స్ పోహా రెసిపీ, దీన్ని చేయడం చాలా సులువు

Haritha Chappa HT Telugu
Aug 01, 2024 06:30 AM IST

Oats Poha: ఓట్స్ తో చేసిన రుచికరమైన రెసిపీ ‘ఓట్స్ పోహా’. ఇది డయాబెటిస్ రోగులకు వరం అని చెప్పాలి. ఓట్స్ తో చేసిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఓట్స్ పోహా రెసిపీ
ఓట్స్ పోహా రెసిపీ (Youtube)

డయాబెటిస్ రోగులు ఏం తిన్నా క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. వారు ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తినడానికి కట్టుబడి ఉండాలి. రుచి విషయంలో రాజీపడకుండా మధుమేహులు టేస్టీగా అల్పాహారాన్ని వండుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ తో రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని వండుకోవచ్చు. ఒకసారి ఓట్స్ పోహాను వండుకుని చూడండి. ఇది రుచిగా ఉండడమే కాదు, ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఫైబర్, ప్రోటీన్, ముఖ్యమైన పోషకాలతో ఇది సమృద్ధిగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కూరగాయలతో చేసే వోట్స్ పోహా సాధారణ పోహా కంటే ఎక్కువ పోషకాలను అందిస్తుంది.

yearly horoscope entry point

ఓట్స్ పోహా రెసిపీకి కావలసిన పదార్థాలు

రోల్డ్ ఓట్స్ - ఒక కప్పు

వేరుశెనగ పలుకులు - గుప్పెడు

ఉల్లిపాయలు - ఒకటి

క్యారెట్లు - రెండు

బఠానీలు - గుప్పెడు

టమోటాలు - ఒకటి

కరివేపాకులు - గుప్పెడు

ఆవాలు - అర స్పూను

ధనియాల పొడి - అర స్పూను

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

వోట్స్ పోహా రెసిపీ

  1. వోట్స్ నీటిలో వేసి నానబెట్టండి. అవి మెత్తబడే వరకు ఉంచండి. తర్వాత స్ట్రెయినర్ సాయంతో వడకట్టి పక్కన పెట్టండి. ౌ
  2. ఇప్పుడు, ఓట్స్ ను స్పూనుతో మెత్తగా రుబ్బండి.
  3. బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఒక టీస్పూన్ ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.
  4. అందులో తరిగిన క్యారెట్లు, బఠానీలు వేసి వేయించండి.
  5. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు వేయాలి.
  6. అన్నీ బాగా కలిపి మరో నిమిషం ఉడికించాలి.
  7. ఇప్పుడు అన్ని మసాలా దినుసులను వేసి కలపండి.
  8. ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ కారం, పసుపు వేసి కలుపుకోవాలి.
  9. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఓట్స్ వేయాలి.
  10. ఓట్స్ మసాలాతో బాగా కలపండి. రెండు నిమిషాలు వేయించండి. పైన కొత్తిమీర తరుగును చల్లుకోండి. అంతే టేస్టీ ఓట్స్ పోహా రెడీ అయినట్టే.

డయాబెటిస్ రోగులకు ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ అల్పాహారాన్ని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Whats_app_banner