Seeds for Iron: శరీరంలో ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే ఈ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ తినండి
Iron rich foods: శరీరంలో ఐరన్ లోపం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అలాంటి వారు డ్రై ఫ్రూట్స్, కొన్ని రకాల నట్స్ తినడం వల్ల ఇనుము శాతం పెరుగుతుంది. దీంతో శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలతో పాటు తగినంత ఇనుము అందుతుంది.
మహిళలు, పిల్లల్లో ఇనుము లోపం కనిపిస్తుంది. దీనివల్ల రక్తహీనత వంటి సమస్య వస్తుంది . రక్తహీనత సమస్య వల్ల తరచుగా తలనొప్పి వస్తుంది. నిద్రసరిగా పట్టదు. ఛాతీలో నొప్పి రావడం, వేగంగా గుండె కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. చిన్న చిన్న పనులకే తీవ్ర అలసట వస్తుంది. ఏ పని మీద ఆసక్తి ఉండదు. ఏకాగ్రత కుదరదు. అందుకే రక్త హీనత సమస్య రాకుండా చూసుకోవాలి.
ప్రెగ్నెన్సీతో పాటు మెనోపాజ్ వచ్చినప్పుడు మహిళల్లో ఐరన్ లోపం మొదలవుతుంది. దీని వల్ల అలసట, మైకము, చేతులు, కాళ్ళు చల్లగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అలాంటప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. అయితే కొన్ని రకాల నట్స్, సీడ్స్ , డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకుంటే మంచిది. వీటిని తింటే ఐరన్ లోపం తొలగిపోతుంది. ఐరన్ అధికంగా ఉండే విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకోండి.
హలీమ్ సీడ్స్
హలీమ్ సీడ్స్ మార్కెట్లో అధికంగానే లభిస్తాయి. ఇవి అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో దొరుకుతాయి. ఈ విత్తనాలను ఆహారంలో తీసుకుంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వంద గ్రాముల హలీం గింజల్లో 17.20 ఐరన్ కంటెంట్ ఉంటుంది.
నల్ల నువ్వులు
నల్ల నువ్వుల్లో కాల్షియంతో పాటు ఐరన్ నిండుగా ఉంటుంది. 100 గ్రాముల నల్ల నువ్వుల్లో 13.90 ఐరన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి రోజుకు గుప్పెడు నువ్వుల గింజలు తింటే మంచిది.
తెల్ల నువ్వులు
తెల్ల నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఇనుము స్థాయి వంద గ్రాములకు 15.04 ఉంటుంది. తెల్ల నువ్వులు కొలెస్ట్రాల్ ను తగ్గించి, లిపిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని కూడా గుప్పెడు తెల్ల నువ్వులు తింటే ఎంతో ఆరోగ్యం.
ఖర్జూరం
ఖర్జూరాల్లో వంద గ్రాములకు 4.79 శాతం ఐరన్ ఉంటుంది. ఇది ఇనుము లోపాన్ని సులభంగా తీర్చగలదు. రోజుకు రెండు ఖర్జూరాలు తినడం అలవాటు చేసుకోవాలి.
నేరేడు
నేరేడు పండ్లు ఇదే సీజన్లో అధికంగా దొరుకుతాయి. వానాకాలంలో కుప్పలుకుప్పలుగా నేరేడు పండ్లు దొరుకుతాయి. వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ గా భావించి తింటూ ఉంటారు. ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఈ పండ్లలో ఇనుము స్థాయి వంద గ్రాములకు 2.50 ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.
టాపిక్