Sleep Apnea : ఈ ప్రాణాంతకమైన డిజార్డర్ మగవారికే ఎక్కువట.. కారణం ఏంటంటే..-all about sleep apnea causes and treatments and symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Apnea : ఈ ప్రాణాంతకమైన డిజార్డర్ మగవారికే ఎక్కువట.. కారణం ఏంటంటే..

Sleep Apnea : ఈ ప్రాణాంతకమైన డిజార్డర్ మగవారికే ఎక్కువట.. కారణం ఏంటంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 17, 2022 09:28 AM IST

Sleep Apnea Causes and Treatments : స్లీప్ అప్నియా అనేది తీవ్రమైన స్లీపింగ్ డిజార్డర్. ఇది రక్తపోటు, గుండెకు సంబంధించిన అనారోగ్యాలను తీవ్రతరం చేస్తుంది. కాబ్టటి దీని గురించి ప్రతి విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అసలు ఇది ఎందుకు వస్తుంది.. చికిత్సలు ఏంటి.. వ్యాధి తీవ్రత వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీపింగ్ డిజార్డర్
స్లీపింగ్ డిజార్డర్

Sleep Apnea Causes and Treatments : స్లీప్ అప్నియా గురించి చాలా మందికి తెలియదు. కానీ అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా ఆ సమస్య మనకు ఉన్నా.. ఇతర కారణాలు అనుకుని లైట్ తీసుకుంటాము కానీ.. ఈ సమస్యను ఆదిలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ రుగ్మత ఎంత భయంకరంగా ఉంటుందంటే.. నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోతుంది. దీనివల్ల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. బిగ్గరగా గురక పెట్టడం కూడా దీనిలోని లక్షణమే. అంతేకాకుండా పగటిపూట ఎక్కువగా, త్వరగా అలసటకు గురవుతారు.

దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే.. గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, రక్తపోటు ప్రమాదాలకు దారితీస్తుంది.

స్లీప్ అప్నియా ఎన్నిరకాలు

స్లీప్ అప్నియా అనేది.. అబ్స్ట్రక్టివ్, సెంట్రల్, కాంప్లెక్స్ అనేవి మూడు రకాలుగా ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ ఎగువ వాయుమార్గంలో పునరావృతమయ్యే పాక్షిక లేదా పూర్తి అడ్డంకికి కారణమవుతుంది. సెంట్రల్ స్లీప్ అప్నియాలో.. వాయుమార్గం అడ్డుకోదు కానీ.. మెదడు కండరాలను శ్వాసించడానికి సూచించడంలో విఫలమవుతుంది. కాంప్లెక్స్ స్లీప్ అప్నియా అంటే మీకు ఒకే సమయంలో అబ్స్ట్రక్టివ్, సెంట్రల్ రెండూ ఉంటాయి.

స్లీప్ అప్నియాకు కారణాలు

అధిక బరువు, వయసు, మెడ చుట్టుకొలత, శ్వాసనాళం ఇరుకైన కారణంగా స్లీప్ అప్నియా వస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అదనంగా కుటుంబ చరిత్ర, మద్యపానం, ధూమపానం మరియు నాసికా రద్దీ వంటివి ఎల్లప్పుడూ ఈ ఆరోగ్య పరిస్థితికి సాధారణ కారణాలుగా చెప్తారు. వాస్తవానికి ఈ వ్యాధి పురుషులకు ఎక్కువగా వస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

స్లీప్ అప్నియా లక్షణాలు

స్లీప్ అప్నియా ఉన్న రోగి వారి లక్షణాలను గుర్తించలేకపోవచ్చు. కానీ వారి బెడ్ పార్టనర్‌లు ఈ సమస్యను సులభంగా గుర్తించగలరు. స్లీప్ అప్నియా ఉన్న వ్యక్తులు బిగ్గరగా గురక పెడతారు. పగటిపూట నిద్రపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది.. లేదా ఉక్కిరిబిక్కిరి అవడం, నిద్రలో చంచలత్వం కారణంగా అకస్మాత్తుగా మేల్కొంటారు.

అదనంగా చాలామంది రాత్రి చెమటలు, తలనొప్పి, ఆందోళన, నిరాశ, నిద్రలేమితో ఇబ్బందిపడతారు. అంతేకాకుండా రోగులు లైంగిక పనిచేయకపోవడం, తరచుగా మూత్రవిసర్జన చేయవలసి ఉంటుంది.

స్లీప్ అప్నియా వ్యాధి నిర్ధారణ

స్లీప్ స్టడీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ స్లీప్ అప్నియాను గుర్తించడంలో సహాయపడతాయి. సంకేతాలు, లక్షణాలను పరిశీలించడానికి వైద్య నిపుణులు మీ కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు. ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థలను పరిశీలించి.. శారీరక పరీక్షలు చేస్తారు. రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు, గుండె పనితీరు, మెదడు కార్యకలాపాలతో దీనిని నిర్ధారణ చేస్తారు.

CPAP

CPAP (Continues Positive Airway Pressure), జీవనశైలి మార్పులు స్లీప్ అప్నియాను అధిగమించడంలో మీకు సహాయపడతాయి. మీరు నిద్రిస్తున్నప్పుడు CPAP ముసుగు ద్వారా మీకు గాలిని అందిస్తుంది. CPAP అసౌకర్యంగా ఉంటే రోగులు నోటి ఉపకరణాన్ని కూడా ఎంచుకోవచ్చు. బరువు తగ్గడం, ధూమపానం, మద్యపానం మానేయడం వంటి జీవనశైలి మార్పులు మీకు చాలా హెల్ప్ చేస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం