Heart Attack in young age: యంగ్ సీరియల్ నటుడికి గుండెపోటు, 30 ఏళ్లకే గుండెలు ఎందుకిలా ఆగిపోతున్నాయ్-a young serial actor has a heart attack why are hearts stopping at the age of 30 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack In Young Age: యంగ్ సీరియల్ నటుడికి గుండెపోటు, 30 ఏళ్లకే గుండెలు ఎందుకిలా ఆగిపోతున్నాయ్

Heart Attack in young age: యంగ్ సీరియల్ నటుడికి గుండెపోటు, 30 ఏళ్లకే గుండెలు ఎందుకిలా ఆగిపోతున్నాయ్

Haritha Chappa HT Telugu
Aug 23, 2024 10:40 AM IST

Heart Attack in young age: ఒకప్పుడు ముసలి వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు యువతలో కూడా గుండె పోటు అధికంగా వస్తోంది. 20 ఏళ్ల వయసు నుంచే గుండె ప్రమాదంలో పడుతుంది. ఇలా యూత్ లోనే గుండె పోటు రావడానికి కారణాలను కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

గుండె పోటు బారిన పడిన యువనటుడు మోసిన్ ఖాన్
గుండె పోటు బారిన పడిన యువనటుడు మోసిన్ ఖాన్

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే గుండె పోటు సమస్య కనిపించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యువగుండెలు కూడా కొట్టుకోవడానికి కష్టపడుతున్నాయి. 20 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా మరణించిన సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు హిందీ సీరియల్ ‘యే రిష్తా క్యా కెహ్లాతా’లోని నటుడు మోహిసాన్ ఖాన్ తాను గుండె పోటు బారిన పడినట్టు చెప్పాడు. అతని వయసు కేవలం 31.

హిందీ సీరియల్స్ చూసే వీక్షకులలో ఇతనికి మంచి పేరుంది. చూసేందుకు మోసిన్ శక్తివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తాడు. తరచూ వ్యాయామాలు చేసి జిమ్ బాడీతో ఉంటాడు. గత ఏడాది తనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోహిసన్ తెలిపాడు. 

కాలేయంలో కొవ్వు పేరుకుపోయి గుండె పోటు వచ్చిందని, దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని మోసిన్ చెప్పాడు. దానికి కారణం తన లైఫ్ స్టైలేనని చెప్పాడాయన. ఆలస్యంగా తినడం, ఆలస్యంగా నిద్రపోవడం వల్ల తనకు గుండె సమస్య వచ్చి ఉండొచ్చని మోసిన్ చెప్పాడు. ఎలాంటి పనులు గుండెను నీరసించేలా చేస్తాయో కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

సమయానికి తినడం, నిద్రపోవడం

మోసిన్ ఖాన్ గుండెపోటుపై కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్తి లాల్ చందానీతో లైవ్ హిందుస్థాన్ మాట్లాడారు. సమయానికి తినడం, నిద్రపోవడం అనేది చాలా ముఖ్యమని చెప్పారు. తినడం, త్రాగటంలో సరైన పద్ధతి పాటించకపోతే గుండె చిక్కుల్లో పడక తప్పదని డాక్టర్ చాందిని వివరించారు. ట్రై-గ్లిజరైడ్స్ కలిగిన అనేక రకాల ఆహారాలను తినడం ద్వారా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం కూడా శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. 

సమయానికి నిద్రపోకపోవడం, సమయానికి మేల్కొనకపోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అతిగా నిద్రపోతే ఒత్తిడి, ఆహారం సరిగా జీర్ణం కాదు. అలాగే తక్కువ నిద్రపోయేవారిలో కూడా ఆహారం జీర్ణం కాదు. కాబట్టి ఇలాంటి అలవాట్లు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. వారి హృదయ స్పందన రేటు పెరుగుతుంది, ఆందోళన అధికంగా ఉంటుంది. గందరగోళానికి గురవుతారు. వారి శరీర భాగాలకు ఆక్సిజన్ అందదు. ఆహారం సరిగా జీర్ణమవదు.

నైట్ షిఫ్టులు చేసేవారు జాగ్రత్త

నైట్ షిఫ్టులు ఉన్నవారు తమ షిఫ్ట్ కు అనుగుణంగా జీవిత చక్రాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలని డాక్టర్ ఆర్తి లాల్ చందానీ సూచించారు. రాత్రిపూట పనిచేసేవారు, పగటిపూట పూర్తి విశ్రాంతి తీసుకోండి. ఇలా చేయకపోతే ఆయుష్షు తగ్గిపోతుంది. కనీసం ఏడు గంటల నిద్ర తగ్గకుండా చూసుకోవాలి.

నైట్ షిప్టులు చేసేవారు పగటి పూట భోజనానికి భోజనానికి మధ్య ఎనిమిది గంటల విరామం ఉండేలా చూసుకోండి. డిన్నర్ కు, మార్నింగ్ డిన్నర్ కు మధ్య ఈ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. రాత్రిపూట ఉపవాసం మంచిదే కానీ రోజులో ఎక్కువ గ్యాప్ తీసుకోకండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కొంచెం కొంచెంగా తినేందుకు ప్రయత్నించండి.

కాలేయంలో కొవ్వు పేరుకుపోయే సమస్యకు, గుండె జబ్బులకు ఉన్న సంబంధంపై డాక్టర్ ఆర్తి లాల్ చందానీ మాట్లాడుతూ ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుందన్నారు. అందుకే తినే ఆహారంలో ఎక్కువ కొవ్వు ఉండే పదార్థాలు తిన కూడదు. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్లు సమతుల్య పరిమాణంలో ఉండేలా తీసుకోవాలి. మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే, కార్బోహైడ్రేట్లను తగ్గించండి. పప్పులు, శనగలు, రాజ్మా, కూర ఇవన్నీ ఎక్కువగా తినండి. పండ్లు, తాజా కూరగాయలతో వండిన ఆహారాన్ని తినండి. నూనె, నెయ్యి తక్కువగా వాడండి.

టాపిక్