Telugu News  /  Lifestyle  /  A 5 Morning Habits That Improve Physical, Mental Health
Healthy Morning Habits:
Healthy Morning Habits: (Unsplash)

Healthy Morning Habits । ఉదయం పూట ఈ రకమైన ఆరోగ్యకరమైన అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యం!

13 October 2022, 7:19 ISTHT Telugu Desk
13 October 2022, 7:19 IST

Healthy Morning Habits: శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉదయం పూట కలిగి ఉండే అలవాట్లే ఎంతో కీలకం. ఇక్కడ మీకే కాకుండా పర్యావరణానికి దోహదం చేసే ఆరోగ్యకరమైన అలవాట్లు పేర్కొన్నం, ఈ అలవాట్లు అలవర్చుకొని చూడండి.

త్వరగా పడుకోవడం, త్వరగా నిద్రలేవడం చేస్తే అది మనిషిని ఆరోగ్యంగా, చురుకుగా, సుసంపన్నంగా ఉంచుతుందని పెద్దలు చెప్పేవారు. కానీ, టెక్నాలజీ పెరిగిపోయిన నేటి సమాజంలో చాలామందికి ఆ ఆరోగ్య సూత్రం పాటించడం వీలు కావడం లేదు. ఇప్పటికీ ఉదయాన్నే నిద్రలేచే వారు ఉన్నారు. కానీ లేవగానే, మొబైల్ ఫోన్ తీసి మెసేజులు చదవడం ఇతర స్మార్ట్ యాప్‌లతో కాలక్షేపం చేయడంతోనే సమయం గడిచిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇలా చేయడం వలన ఉదయమే నిద్రలేచి లాభం లేదు. ఈ అలవాటు ఆ రోజంతా ఉత్పాదకతను దెబ్బతీస్తుంది, ఆరోగ్యంపైనా చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఉదయం సరైన అలవాట్లను కలిగి ఉండాలి. ఈ మార్నింగ్ రొటీన్ మార్పులు మీ జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంచడంలో చాలా దోహదపడతాయి.

రోజులో ఉత్పాదకత పెరగటానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడే 5 ఉదయం అలవాట్లు కొన్ని ఇక్కడ చూడండి.

ఆయిల్ పుల్లింగ్

నోటి నుండి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను తొలగించడానికి ఇది ఒక ప్రసిద్ధ సాంప్రదాయ ఆయుర్వేద టెక్నిక్. ఇది మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కేవలం నోటి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది కాబట్టి మీ ఉదయపు దినచర్యలో ఆయిల్ పుల్లింగ్ చేసే అలవాటును చేర్చుకోండి.

నిద్రలేచిన వెంటనే ఒక చెంచా కొబ్బరి నూనె లేదా మరేదైనా మంచి నూనెను తీసుకొని, దానిని మింగకుండా మీ నోటిలో ఒక నిమిషం పాటు స్విష్ చేయండి, ఆ తర్వాత ఉమ్మివేసి నోరు శుభ్రం చేసుకోండి. ఇది మీ నోటిలో బాక్టీరియాను తొలగించి నోటిని శుభ్రపరుస్తుంది.

వెదురు టూత్ బ్రష్ ఉపయోగించడం

దంతాలు తోముకోవడానికి ప్లాస్టిక్‌ బ్రష్ కాకుండా పర్యావరణ అనుకూలమైన బయోడిగ్రేడబుల్ టూత్ బ్రష్‌లు లేదా చెక్కతో చేసిన టూత్ బ్రష్‌లు ఉపయోగించండి. వెదురు టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కలప సహజ గుణాలు యాంటీమైక్రోబయాల్‌గా పనిచేస్తాయి, సూక్ష్మజీవులను విచ్ఛిన్నం చేస్తాయి.ఇది మీ శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

టంగ్ స్క్రాపింగ్

నిద్రపోయినపుడు బ్యాక్టీరియా, ఇతర హానికర కణాలు నాలుకపై పేరుకుపోతాయి. కాబట్టి నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఇది టంగ్ స్క్రాపింగ్ చేయాలి. రోజుకు రెండుసార్లు టంగ్ స్క్రాపర్‌ని ఉపయోగించడం వలన నాలుక శుభ్రం అవుతుంది. వివిధ రుచుల మధ్య వైవిధ్యతను గుర్తించడం మెరుగుపడినట్లు గమనిస్తారు. ఈ అలవాటు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.

నీళ్లు తాగండి

ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగండి. శరీరం హైడ్రేట్ అవుతుంది. మీ శరీర అవయవాలు, కణజాలాల సరైన పనితీరుకు నీరు ముఖ్యమైన పోషకం. ఉదయం పూట స్క్వాట్ పొజిషన్‌లో ఒక గ్లాసు నీటిని తాగటం ఉత్తమ మార్గం. ఈ పద్ధతిలో నీరు తాగితే కండరాలు, నాడీ వ్యవస్థను సడలించవచ్చు. కూర్చున్నప్పుడు మీ మూత్రపిండాలు కూడా వడపోత ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ద్రవాలను జీర్ణం చేయడం సులభం అవుతుంది.

యోగా- మెడిటేషన్

నిద్రలేచిన తర్వాత మీతో మీరు కనెక్ట్ అవటానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా, మీరు మీ మనస్సును, శరీరాన్ని కనెక్ట్ చేయగలుగుతారు. మీకు ఏ విషయంలోనైనా స్పష్టత ఉంటుంది, ప్రతి అంశాన్ని సరిగ్గా సమన్వయం చేసుకోగలుగుతారు. మీ కోసం కేవలం 5 నిమిషాలు కేటాయించి ఊపిరి పీల్చుకుని ఓం మంత్రాన్ని జపించండి. లేదా యోగా, ధ్యానం ఆచరించండి.