20 Before forty: 40 ఏళ్ల లోపు చేయాల్సిన 20 పనులు-20 things to do before turning 40 years old both men and women ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  20 Before Forty: 40 ఏళ్ల లోపు చేయాల్సిన 20 పనులు

20 Before forty: 40 ఏళ్ల లోపు చేయాల్సిన 20 పనులు

Koutik Pranaya Sree HT Telugu
Sep 21, 2024 12:30 PM IST

20 Before 40: మీకు నలభై ఏళ్ల వయసు వచ్చేలోపు మీరు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 20 పనులేంటో చూడండి.

40 ఏళ్ల లోపు చేయాల్సిన 20 పనులు
40 ఏళ్ల లోపు చేయాల్సిన 20 పనులు

నలభై సంవత్సరాల వయస్సంటే దాదాపు సగం ఆరోగ్యకర జీవితం గడిచినట్లే. ఆ వయసు తర్వాత కొన్ని పనులు చేయాలన్నా చేయలేరు. అందుకే మీకు నలభై ఏళ్లు వచ్చేలోపు మీరు తప్పకుండా కొన్ని పనులు చేయాలనుకోండి. 1990కి అటూ ఇటూగా పుట్టిన వాళ్ల వాళ్ల వయసు ముప్ఫై ఏళ్లకు దగ్గర పడ్డట్లే. కొందరిది దాటేసినట్లే. రాబోయే పదేళ్లలో మీ జీవితంలో మీరు తప్పకుండా చేయాల్సిన పనులేంటో చూడండి.

40 ఏళ్ల లోపు చేయాల్సిన 20 పనులు:

1. అప్పులు తీర్చేసుకోండి. నలభై దాటేలోపు మీకు ఏ రకమైన అప్పులు లేకుండా అన్నింటి నుంచి బయటపడండి

2. మీ రిటైర్‌మెంట్ తర్వాతి జీవితం కోసం కూడా ఇప్పటినుంచే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టండి.

3. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్లానింగ్ పక్కాగా వేయండి. దానికి మీవంతు ఏం చేయొచ్చో వందశాతం చేయండి.

4. మీ భాగస్వామి మీద ప్రతి పనికీ ఆధారపడకండి. మీకంటూ కొన్ని పనులు వచ్చి ఉండాలి.

5. ఒక్కసారైనా క్రూజ్ లో, విమానంలో ప్రయాణం చేయండి.

6. కొండెక్కి లేదా ట్రెక్కింగ్ చేసి మాత్రమే చూడగల ప్రదేశాలు, పుణ్య క్షేత్రాలుంటే ఇప్పుడే చూడ్డానికి ప్లానింగ్ వేసుకోండి.

7. ఇల్లు కొనుక్కోండి. చిన్నదో పెద్దదో మీకంటూ ఓ సొంతిళ్లు ఉండాలి.

8. మీ ఉద్యోగంలో మీ ఉత్తమ ప్రతిభ చూపండి. మీ ఉద్యోగంలో మీ విలువ తగ్గకుండా నైపుణ్యాల్ని మెరుగు పర్చుకోండి.

9. ప్రమోషన్ల కోసం సంపూర్ణ ప్రయత్నం, కష్టం చేయండి.

10. ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థలో చేరండి. వారానికో, నెలకో ఒక్క రోజైనా మీ సేవలు అందించండి. ఇది మీ జీవితం మీద దృక్పథాన్ని మారుస్తుంది.

11. మీరు ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకుంటున్నా ఖరీదైన వస్తువు ఏదైనా ఉంటే కొనేసుకోండి. నగలో, బట్టలో, ఫోనో.. ఏదైనా మీకోసం మీరిచ్చుకునే కానుక.

12. పిల్లల ప్రేమలో పడి భాగస్వామి ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. మీ జీవిత భాగస్వామికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి.

13. మీకు సమయం ఉన్నప్పుడు మీ భాగస్వామికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి కుటుంబ వ్యవహారాలు, ఇంటి పనులు, వంట, సామాన్లు కొనడం లాంటివి మీరే చేయండి. అంటే ఎప్పుడూ మీ భాగస్వామే చేసే పనులు ఈసారి మీరు చేయండి. కుటుంబానికి మీరిచ్చే మంచి బహుమతి ఇది.

14. మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు చూడటం మొదలు పెట్టండి.

15. నెలకో చిన్న ట్రిప్, సంవత్సరానికి కాస్త దూర ప్రదేశాలకు వెళ్లడానికి ప్లానింగ్ వేసుకోండి.

16. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే తక్షణమే తీసుకోండి.

17. వైద్యుల సలహా మేరకు సంవత్సరానికి ఒకసారైనా పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోండి.

18. మీలో వస్తున్న ఆరోగ్య సమస్యలను, పోషకాహార లోపాలను నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోండి.

19. వాకింగ్, యోగా లాంటివి మీ జీవితంలో భాగం చేసుకోండి.

20. ఒంటరిగా ఎక్కడికైనా, ఒక్కసారైనా వెళ్లిరండి.

టాపిక్