Vijayashanti: మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్‌గా విజయశాంతి.. కర్తవ్యం తరహాలో.. హీరో, విలన్ ఎవరంటే?-vijayashanthi police role as vyjayanthi ips in nandamuri kalyan ram nkr 21 after karthavyam movie first glimpse released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijayashanti: మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్‌గా విజయశాంతి.. కర్తవ్యం తరహాలో.. హీరో, విలన్ ఎవరంటే?

Vijayashanti: మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్‌గా విజయశాంతి.. కర్తవ్యం తరహాలో.. హీరో, విలన్ ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 25, 2024 06:09 AM IST

Vijayashanthi Police Role In Nandamuri Kalyan Ram NKR21: మళ్లీ పవర్‌‌ఫుల్ పోలీస్ పాత్రలో అదరగొట్టేందుకు రెడీగా ఉన్నారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. నందమూరి కల్యాణ్ రామ్ ఎన్‌కేఆర్ 21 సినిమాలో వైజయంతీ ఐపీస్ పాత్రలో నటించనున్న విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్‌గా విజయశాంతి.. కర్తవ్యం తరహాలో.. హీరో, విలన్ ఎవరంటే?
మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్‌గా విజయశాంతి.. కర్తవ్యం తరహాలో.. హీరో, విలన్ ఎవరంటే?

Vijayashanthi Police Role In NKR21: తన కెరీర్‌లో పోషించిన అద్భుతమైన ఇంటెన్స్ క్యారెక్టర్స్‌తో లేడీ సూపర్ స్టార్‌గా పేరుపొందారు విజయశాంతి. చాలా కాలం తర్వాత ఆమె నందమూరి కల్యాణ్ రామ్ #NKR21 చిత్రానికి సైన్ చేశారు. ఇది చాలా అద్భుతమైన స్క్రిప్ట్. ఇందులో కర్తవ్యం (1990) తరహాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అంటే 34 ఏళ్ల తర్వాత పోలీస్‌గా అలరించనున్నారు.

విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమె పాత్రను వైజయంతి IPS అని పరిచయం చేశారు. ఆమె షేడ్స్‌తో ఖాకీ దుస్తుల్లో డాషింగ్‌గా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ పోస్టర్ అతి కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

మేకర్స్ విజయశాంతి క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. “వైజయంతి ఐపీఎస్.. తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫాంకే పౌరుషం వస్తుంది.. తానే ఒక యుద్ధం.. నేనే తన సైన్యం..” అంటూ కల్యాణ్ రామ్ వాయిస్‌ ఓవర్‌తో విజయశాంతి క్యారెక్టర్ రోల్‌ని ప్రజెంట్ చేశారు. ఈ గ్లింప్స్ అదిరిపోయింది. కల్యాణ్ రామ్ కూడా వీడియోలో ఫెరోషియస్‌గా కనిపించారు.

ప్రదీప్ చిలుకూరి రచన, దర్శకత్వం వహిస్తున్న #NKR21 నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా విడుదలైన ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్ గ్లింప్స్ ‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. గ్లింప్స్ యాక్షన్‌తో అదరగొట్టింది. కల్యాణ్ రామ్‌ని కొత్త గెటప్‌లో కనిపించారు. డెవిల్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ చేస్తున్న సినిమా ఇది.

#NKR21 అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో బిగ్ స్కేల్‌లో జరుగుతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్, మేజర్ బ్యూటి సాయి మంజ్రేకర్, సీనియర్ హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

చూస్తుంటే బాలీవుడ్ టాప్ యాక్టర్ సోహెల్ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడని తెలుస్తోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీగా పని చేస్తుండగా, మంగళవారం సినిమా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు. కాగా చాలా కాలం గ్యాప్ తర్వాత విజయశాంతి మళ్లీ పోలీస్‌ పాత్రలో కనిపించడం విశేషంగా మారింది. హీరోయిన్లలో మాస్ రోల్స్‌లో, పోలీస్ పాత్రలో నటించి విపరీతమైన పేరు తెచ్చుకున్నవాళ్లో విజయశాంతి ముందు వరుసలో ఉంటారు. లేడి ఒరియెంటెడ్ చిత్రాల్లో పోలీస్‌గా ఆమెకు వచ్చినంతగా సక్సెస్ ఏ హీరోయిన్‌కు రాలేదు.

పోలీస్‌ పాత్రకు తనే పర్ఫెక్ట్ అనేలా తన పవర్ ఫుల్ యాక్టింగ్‌తో విజయశాంతి పేరు తెచ్చుకున్నారు. ఆమె తర్వాత ఎంతోమంది హీరోయిన్స్ పోలీస్ రోల్స్ చేసినా కూడా అంత క్రేజ్ తెచ్చుకోలేకపోయారు. ఇకపోతే మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి విజయశాంతి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడే సినిమాలో కనిపిస్తున్నారు విజయశాంతి.

WhatsApp channel