Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 14 సినిమాలు.. 12 చాలా స్పెషల్.. హారర్ టు మర్డర్ మిస్టరీ.. వీకెండ్‌కు బెస్ట్!
Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 4) ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా 12 వరకు చూడాల్సినవిగా స్పెషల్ సినిమాలు ఉన్నాయి. వాటిలో తెలుగు డైరెక్ట్ మూవీతోపాటు హారర్, సైకలాజికల్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
Today OTT Releases Telugu: ప్రతి వారం ఓటీటీల్లో విభిన్నమైన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ రిలీజ్ అవుతాయి. అలాగే, ఈ వారం దాదాపుగా 30 వరకు సినిమాలు రాగా.. వాటిలో ఇవాళ (అక్టోబర్ 4) ఒక్కరోజే ఏకంగా 14 వరకు విడుదల అయ్యాయి. వాటిలో డైరెక్ట్ తెలుగు సినిమాతోపాటు హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ట్రబుల్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 3
కంట్రోల్ (సీటీఆర్ఎల్) (హిందీ చిత్రం)- అక్టోబర్ 4
ఇట్స్ వాట్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 4
ది ప్లాట్‌ఫామ్ 2 (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 4
రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 5
ది సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపోకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
పౌడర్ (కన్నడ చిత్రం)- అక్టోబర్ 4
ది ట్రైబ్ (హిందీ రియాలిటీ షో)- అక్టోబర్ 4
కళింగ (తెలుగు హారర్ చిత్రం)- అక్టోబర్ 4
మై ఫాల్ట్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 4
ఆహా ఓటీటీ
బాలు గాని టాకీస్ (తెలుగు సినిమా)- అక్టోబర్ 4
కళింగ (తెలుగు హారర్ సినిమా)- అక్టోబర్ 4
జీ5 ఓటీటీ
కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ సినిమా)- అక్టోబర్ 4
ది సిగ్నేచర్ (హిందీ చిత్రం)- అక్టోబర్ 4
అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ చిత్రం)- జియో సినిమా ఓటీటీ- అక్టోబర్ 4
ఆనందపురం డైరీస్ (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్, సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- అక్టోబర్ 4
మన్వత్ మర్డర్స్ (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 4
వేర్ ఈజ్ వాండా (జర్మన్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 4
14 సినిమాలు
ఇలా ఇవాళ (అక్టోబర్ 4) ఒక్కరోజే ఓటీటీలోకి 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ బాలు గాని టాకీస్ స్పెషల్ కానుంది. అలాగే, తెలుగు హారర్ మూవీ కళింగ చాలా ఇంట్రెస్టింగ్ చిత్రంగా ఉండనుంది. హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది సిగ్నేచర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్ కూడా చాలా క్యూరియాసిటీ పెంచేవిగా ఉన్నాయి.
హారర్ థ్రిల్లర్స్
హిందీ రొమాంటిక్ డ్రామా సినిమా అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ, సీనియర్ హీరోయిన్ నటించిన మలయాళ చిత్రం ఆనందపురం డైరీస్, అనన్య పాండే సైకలాజికల్ థ్రిల్లర్ కంట్రోల్, ఇట్స్ వాట్ ఇన్ సైడ్, హారర్ థ్రిల్లర్ ది ప్లాట్‌ఫామ్ 2, కన్నడ మూవీ పౌడర్, హిందీ రియాలిటీ షో ది ట్రైబ్ కూడా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు.
చూసేందుకు 12
ఇదివరకు ఎప్పటినుంచో స్ట్రీమింగ్ ఉన్న హాలీవుడ్ చిత్రం మై ఫాల్ట్ ఇవాళ తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోకి స్ట్రీమింగ్ వచ్చింది. ఇది కూడా స్పెషల్ సినిమానే. ఇలా 14 ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో పది సినిమాలు, ఒక వెబ్ సిరీస్, మరొక రియాలిటీ షోతో 12 చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి.