Today OTT Movies: ఇవాళ ఓటీటీలో సినీ జాతర.. ఒక్కరోజే 12 స్ట్రీమింగ్.. చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడంటే?-today ott movies new ott releases this friday on netflix amazon prime disney plus hotstar bhaje vaayu vegam ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఇవాళ ఓటీటీలో సినీ జాతర.. ఒక్కరోజే 12 స్ట్రీమింగ్.. చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడంటే?

Today OTT Movies: ఇవాళ ఓటీటీలో సినీ జాతర.. ఒక్కరోజే 12 స్ట్రీమింగ్.. చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 28, 2024 08:16 AM IST

New OTT Releases Friday: ఇవాళ ఒక్కరోజే ఓటీటీల్లోకి ఏకంగా 12 సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో సినిమాలతోపాటు వెబ్ సిరీసులు సైతం ఉన్నాయి. అయితే, ఈ పన్నెండింట్లో చూడాల్సినవి మాత్రం రెండు, మూడు మాత్రమే ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.

ఇవాళ ఓటీటీలో సినీ జాతర.. ఒక్కరోజే 12 స్ట్రీమింగ్.. చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడంటే?
ఇవాళ ఓటీటీలో సినీ జాతర.. ఒక్కరోజే 12 స్ట్రీమింగ్.. చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడంటే?

Today OTT Releases: రోజులు వారాలు ఎంత త్వరగా గడుస్తున్నాయో ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు అలాగ కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. కానీ, వాటిలో తెలుగు ప్రేక్షకులు చూసేందుకు మాత్రం పెద్ద ఇంట్రెస్టింగ్ సినిమాలు లేవు.

ఇక ప్రతి శుక్రవారం కాస్తా ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలో దర్శనం ఇస్తుంటాయి. అలా ఇవాళ అంటే జూన్ 28న (Friday OTT Release) ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి. కానీ, వాటిలో అతి తక్కువగా మూడు మూవీస్ మాత్రమే తెలుగు ఆడియెన్స్ చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది కార్ప్స్ వాషర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 28

ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28

ది విర్ల్ విండ్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 28

ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28

భజే వాయు వేగం (తెలుగు సినిమా)- జూన్ 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

శర్మాజీ కీ బేటీ (హిందీ చిత్రం)- జూన్ 28

సివిల్ వార్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

వండ్ల (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28

ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28

ఆవేశం (హిందీ డబ్బింగ్ సినిమా)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 28

రౌతు కీ రాజ్ (హిందీ చిత్రం)- జీ5 ఓటీటీ- జూన్ 28

హిగ్యుటా (మలయాళ మూవీ)- సైనా ప్లే ఓటీటీ- జూన్ 28

హిందీ మూవీ

ఇలా ఇవాళ సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని మొత్తంగా 11 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఫ్యామిలీ కామెడీ జోనర్‌లో వచ్చిన శర్మాజీ కీ బేటీ అనే హిందీ సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. అయితే, భాషతో సంబంధం లేదనుకునే ఓటీటీ ఆడియెన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్

దీంతోపాటు ఇదే అమెజాన్ ప్రైమ్‌లో హాలీవుడ్ యాక్షన్ మూవీ సివిల్ వార్ సైతం ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ హీరోయిన్ క్రిస్టెన్ డన్స్ట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇంగ్లీషుతోపాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో

ఇక తెలుగు ప్రేక్షకుల కోసం ఈ వారం రొమాంటిక్ బోల్డ్ మూవీ లవ్ మౌళితోపాటు యాక్షన్ ఎంటర్టైనర్ భజే వాయు వేగం సినిమాలో ఓటీటీలోకి వచ్చాయి. లవ్ మౌళి సినిమా జూన్ 27 నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక భజే వాయు వేగం మూవీ ఇవాళ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌కు మంచి ఆప్షన్ కానుంది.

WhatsApp channel