OTT Bold Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ మూవీ.. రెండింట్లో కాదు ఒక్కదాంట్లోనే స్ట్రీమింగ్.. పెద్దలకు మాత్రమే!
Love Mouli OTT Streaming Now: ఓటీటీలోకి తాజాగా పెద్దలు మాత్రమే చూడాల్సిన తెలుగు బోల్డ్ సినిమా లవ్ మౌళి వచ్చేసింది. మొదట్లో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుందని ప్రచారం జరగ్గా ఇప్పుడు ఒక్కదాంట్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటని చూస్తే..
Love Mouli OTT Release: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఎన్నో రకాల జోనర్ సినిమాలు దర్శనం ఇస్తుంటాయి. వాటిలో బోల్డ్ కంటెంట్ సినిమాలు సైతం ఉన్నాయి. లవ్, ఎమోషన్స్, రొమాంటిక్ సీన్లతో బోల్డ్ సినిమాలను నింపేస్తుంటారు. ఈ సినిమాలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ జోనర్ తరహా సినిమాలు రావడం కూడా చాలా అరుదుగానే జరుగుతుంది.
యూత్ ఎంజాయ్ చేసే సీన్స్
అయితే, ఇటీవల తెలుగులో వచ్చిన బోల్డ్ సినిమానే లవ్ మౌళి. చాలా కాలం గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటించిన సినిమాలో బోల్డ్ కంటెంట్ బాగానే ఉందని టాక్ వచ్చింది. అది కూడా పెద్దలకు మాత్రమే అనేంతలా బోల్డ్ సీన్స్ ఉన్నాయని సమాచారం. అయితే, యూత్ తెగ ఎంజాయ్ చేసే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని రివ్యూల్లో తెలిపారు.
రెండు ఓటీటీల్లో
అలాంటి సూపర్ రొమాంటిక్ బోల్డ్ మూవీ లవ్ మౌళి ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, మొదట్లో లవ్ మౌళి సినిమాను రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసుకున్నాయని టాక్ వచ్చింది. అవి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ సంస్థలు. ఈ రెండింట్లో జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో లవ్ మౌళి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరిగింది.
ఒకేదాంట్లో స్ట్రీమింగ్
కానీ, రెండు ఓటీటీల్లో కాకుండా ఒకే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో లవ్ మౌళి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అదే అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో. ఈ ఆహా ఓటీటీలో ఇవాళ అంటే జూన్ 17 అర్థరాత్రి నుంచి లవ్ మౌళి సినిమా ప్రసారం అవుతోంది. పెద్దలు మాత్రమే, కేవలం ఓటీటీలో మాత్రమే చూడాల్సిన ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ ప్రీమియర్ గురించి ఇదివరకే ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది.
బెడ్ అండ్ కిస్సింగ్ సీన్స్
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా హ్యాండిల్లో లవ్ రొమాంటిక్ మూవీ లవ్ మౌళిని జూన్ 27 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ప్రకటనకు తగినట్లగానే గురువారం ఓటీటీలో దర్శనం ఇచ్చింది ఈ మూవీ. ఇక సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కిస్సింగ్ సీన్స్, బెడ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయని సమాచారం. దానికి మూవీ ట్రైలరే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
20 రోజుల్లోనే ఓటీటీలోకి
స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించే పాత్రలో నవదీప్ నటించినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్స్‌గా పంఖురి గిద్వానీ, చార్వీ దత్తా, భావనా సాగి చేశారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి అఘోరా అనే పాత్రలో గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పని చేసిన అవనీంద్ర దర్శకత్వం వహించారు. జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
బ్రాలో మందు తాగడం
నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో సీ స్పేస్ లవ్ మౌళి చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఓ పోస్టర్ కాస్తా వివాదంగా మారింది. అందులో బ్రాలో నవదీప్ మందు తాగుతూ కనిపిస్తాడు. హీరో క్యారెక్టర్ ఇది అని చెప్పడానికి, అతనికి ఎలాంటి సెన్సిబిలిటీస్ లేవని చెప్పడానికే ఆ సీన్ అని డైరెక్టర్ వివరణ ఇచ్చారు.
టాపిక్