Aamis Review: ఆమిస్ రివ్యూ.. మనిషి మాంసానికి రుచి మరిగిన లేడి డాక్టర్.. ఓటీటీ రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Aamis Movie Review In Telugu: ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే ఆమిస్. మనిషి మాంసానికి రుచి మరిగిన లేడి డాక్టర్ కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ అండ్ హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీ ఎలా ఉందో ఆమిస్ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఆమిస్
నటీనటులు: లిమా దాస్, అర్ఘదీప్ బారుహ్, నీతాలీ దాస్, సమర్జ్యోతి సర్కార్ ఇతరులు
కథ, దర్శకత్వం: భాస్కర్ హజారికా
నిర్మాతలు: పూనమ్ డియోల్, శ్యామ్ బోరా
సంగీతం: క్వాన్ బే
సినిమాటోగ్రఫీ: రిజు దాస్
ఓటీటీ వేదిక: సోనీ లివ్
Aamis Movie Review Telugu: ఓటీటీలో ఎన్నో రకాల కాన్సెప్ట్‌తో సినిమాలు అలరిస్తున్నాయి. కానీ, ఇలాంటి తరహా సినిమా మాత్రం ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. ఆ సినిమానే ఆమిస్ (Aamis Movie). అస్సామీ భాషలో తెరకెక్కించిన ఈ సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. దాంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. 2019 ఏప్రిల్ 28న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమా 5 కేటగిరీల్లో నామినేట్ అయింది.
అనంతరం ఇండియాలో 2019 నవంబర్ 22న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో (Sony Liv OTT) అదరగొడుతోందీ ఈ సినిమా. డిఫరెంట్ అండ్ సెన్సువల్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ అండ్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఆమిస్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
నిర్మాలి (లిమా దాస్) ఒక పిడియాట్రిషన్. అంటే చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్. భర్త, ఒక బాబుతో సంతోషంగా జీవిస్తుంటుంది. సుమోన్ (అర్ఘదీప్ బారుహ్) ఉత్తర భారతదేశంలోని వివిధ మాంసపు వంటకాలపై రీసెర్చ్ చేసే పీహెచ్‌డీ విద్యార్థి. ఓ రోజు తన ఫ్రెండ్‌కు ఆరోగ్యం బాలేకపోవడంతో ఇంటికి దగ్గరగా ఉన్న డాక్టర్ నిర్మాలిని ట్రీట్‌మెంట్ చేయాల్సిందిగా వేడుకుంటాడు సుమోన్. మొదట తాను పిల్లల డాక్టర్‌ను అని, ట్రీట్‌మెంట్ చేయలేనని చెప్పిన నిర్మాలి తర్వాత ఒప్పుకుంటుంది.
హైలెట్స్
సుమోన్ ఫ్రెండ్‌కు ట్రీట్‌మెంట్ చేస్తుంది. తర్వాత నిర్మాలిని తన ఇంటి వరకు డ్రాప్ చేసే క్రమంలో ఇద్దరూ ఫ్రెష్ మీట్, వాటి వంటకాల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరికి ఒకరిపై మరొకరికి ఇంట్రెస్ట్, ఫీలింగ్స్ పెరుగుతాయి. అనంతరం ఇద్దరి పరిచయం ఎక్కడికి దారి తీసింది..? నిర్మాలికి సుమోన్ ఎలాంటి వంటకాలు రుచి చూపించాడు? నిర్మాలితో ప్రేమలో పడిన సుమోన్ తన మెప్పు కోసం ఎలాంటి ప్రయోగాలు చేశాడు? నిర్మాలి ఎలాంటి మాంసం కావాలని కోరుకుంది? అందుకు సుమోన్ ఏం చేశాడు? చివరికీ ఇద్దరి జీవితాల్లో జరిగిన పెను మార్పు ఏంటీ? అనేది తెలియాలంటే ఆమిస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆమిస్ అంటే అస్సామి భాషలో మాంసాహారి అని అర్థం. టైటిల్‌కు తగినట్లే సినిమా ఉంటుంది. ఆమిస్ మూవీలో వివిధ రకాల నాన్ వెజిటేరియన్ వంటకాల గురించి చూపిస్తారు. సినిమాలో ప్రధాన పాత్రలు మూడు. ఆ పాత్రలోతోనే టైటిల్స్ చూపిస్తూ వాళ్ల చుట్టే సినిమా ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక నిర్మాలి, సుమోన్ పరిచయం.. వివిధ నాన్ వెజ్ డిషెస్ చేసి నిర్మాలి కోసం సుమోన్ తీసుకెళ్లడంతో సినిమా సాగుతుంటుంది.
రొమాంటిక్ ఫీలింగ్
వివిధ రకాల డిషెస్‌ను, అవి దొరికే ప్లేసులకు నిర్మాలిని సుమోన్ తీసుకెళ్లడం వంటి సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా కాస్తా రొమాంటిక్‌గా ఉంటాయి. కానీ, ఎక్కడ హద్దు దాటిన సీన్స్ చూపించలేదు. నిర్మాలి, సుమోన్‌కు ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమకు సంబంధించిన ఇమాజినేషన్ సీన్స్ చాలా బాగా చూపించారు. ఇద్దరి లవ్ ఫీల్ అయ్యే విధంగా సీన్స్ ఉన్నాయి.
షాకింగ్‌గా ప్రయోగపు వంట
నిర్మాలి మెప్పు కోసం సుమోన్ చేసే ప్రయోగకరమైన వంట షాక్‌కు గురి చేయడంతో కొత్త మలుపు తీసుకుంటుంది సినిమా. ఏకంగా తన తొడ మాంసంతోనే చాలా వెరైటీగా, బ్యూటిఫుల్‌గా డెకరెట్ చేసి రుచి చూపిస్తాడు సుమోన్. అది రుచి చూసిన నిర్మాలి స్వర్గంలో విహరిస్తుంది. అలా చూపించే విజువల్స్ అట్రాక్ట్ చేస్తాయి. తన ఫీల్ అయ్యే డెప్త్‌ను మనం బాగా అర్థం చేసుకునే విధంగా సీన్ డిజైన్ చేశారు.
సినిమాలో న్యూ టర్న్
అనంతరం ఆ మాంసం సుమోన్‌ది అని తెలియడం ముందు కోప్పడటం, ఆ తర్వాత అది నచ్చడంతో సినిమా కొత్త టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది, నిర్మాలి ఎలాంటి కోరిక కోరింది, దానికోసం సుమోన్ ఏం చేశాడు అనేది చెబితే స్పాయిలర్ అవుతుంది. సినిమా టేకింగ్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి.
కాస్తా స్లో నెరేషన్
అయితే 108 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా కాస్తా స్లోగా రన్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అది ప్రేక్షకులను లోతుగా అర్థం చేసుకునేందుకు డైరెక్టర్ పలు సీన్లతో సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ కూడా కొంతవరకు ఊహించలేం. నెక్ట్స్ పార్ట్ కూడా ఉంటుందా అనే డౌట్ వస్తుంది. కానీ, అది ఓపెన్ ఎండ్ క్లైమాక్స్ అని టాక్.
సెన్సిబుల్ పీపుల్స్ మాత్రం
ఈ సినిమా రియల్ స్టోరీ అని జోరుగా ప్రచారం సాగింది. కానీ, అలాంటిదేం కాదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే సెన్సిబుల్ పీపుల్, వెజిటేరియన్స్ మాత్రం ఆమిస్‌ను చూసేముందు ఆలోచించుకోవడం బెటర్. అయితే, ఎలాంటి బోల్డ్ సీన్స్, అసభ్యకర డైలాగ్స్, సన్నివేశాలు మాత్రం ఏ లేవు. ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి ఆమిస్ మంచి ఆప్షన్.