Aishwarya Arjun Wedding Video: హీరో అర్జున్ సర్జా కూతురు పెళ్లి వీడియో వైరల్.. ఎమోషనల్‌గా యాక్షన్ కింగ్ నోట్-actor arjun sarja shares his daughter aishwarya arjun wedding video with umapathy ramayya aishwarya umapathy marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Arjun Wedding Video: హీరో అర్జున్ సర్జా కూతురు పెళ్లి వీడియో వైరల్.. ఎమోషనల్‌గా యాక్షన్ కింగ్ నోట్

Aishwarya Arjun Wedding Video: హీరో అర్జున్ సర్జా కూతురు పెళ్లి వీడియో వైరల్.. ఎమోషనల్‌గా యాక్షన్ కింగ్ నోట్

Sanjiv Kumar HT Telugu
Jun 14, 2024 12:03 PM IST

Arjun Sarja Shares Daughter Aishwarya Wedding Video: యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న హీరో, నటుడు అర్జున్ సర్జా తన కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఎమోషనల్‌గా క్యాప్షన్ రాసుకొచ్చాడు హీరో అర్జున్.

హీరో అర్జున్ సర్జా కూతురు పెళ్లి వీడియో వైరల్.. ఎమోషనల్‌గా యాక్షన్ కింగ్ నోట్
హీరో అర్జున్ సర్జా కూతురు పెళ్లి వీడియో వైరల్.. ఎమోషనల్‌గా యాక్షన్ కింగ్ నోట్

Aishwarya Arjun Umapathy Wedding Video Viral: హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ఉమాపతి రామయ్యల వివాహానికి శుభాకాంక్షలు తెలిపుతూ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. జూన్ 13న తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూతురు పెళ్లి వీడియోను అర్జున్ సర్జా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రామయ్య వెడ్డింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

జూన్ 10న అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య-ఉమాపతి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకలో కన్నడ నటుడు ధృవ సర్జా కూడా పాల్గొన్నారు. చెన్నైలోని గెరుగంబాక్కంలోని హనుమాన్ దేవాలయంలో ఐశ్వర్య, ఉమాపతి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. దీంతో ఈ జంటను కన్నడతోపాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆశీర్వదించారు.

ఇక అర్జున్ షేర్ చేసిన పోస్టులో ఐశ్వర్య- ఉమాపతి మ్యారేజ్ గ్లింప్స్ చూడొచ్చు. ఇందులో ఉమాపతి, ఐశ్వర్య ఎంతో సాంప్రాదయబద్ధంగా కనిపించారు. పెళ్లి మండపాన్ని టాప్ యాంగిల్‌లో చూపిస్తూ పండితుల వేద మంత్రాలతో వీడియో ప్రారంభం అయింది. అనంతరం ఎంతో చక్కని వీణ సంగీతంతో వీడియో కొనసాగింది. తర్వాత వధువు వరుల ఇన్విటేషన్ బోర్డ్ చూపించారు. పాపులర్ సెలబ్రిటీలు రావడం, వారిని అర్జున్ ఆహ్వానం పలకడం చూపించారు.

అల్లుడుని గొడుగు పట్టి అర్జున్ తీసుకురావడం, అనంతరం పెళ్లి పీటలపై ఐశ్వర్య, ఉమాపతి సందడి కన్నులవిందుగా జరిగింది. అల్లుడికి అర్జున్ ముద్దుపెట్టడం హైలెట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, కూతురు పెళ్లి వీడియోను షేర్ చేసిన అర్జున్ ఎమోషనల్ నోట్ రాసుకొస్తూ క్యాప్షన్ ఇచ్చారు.

"మా ముద్దుల కూతురు ఐశ్వర్య తన జీవితంలోని ప్రేమను, తన ప్రియమైన ఉమాపతిని వివాహం చేసుకున్నందుకు మేము అనుభవిస్తున్న ఆనందాన్ని, సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. ఇది ప్రేమ, నవ్వుతో కలగలిపిన మరపురాని జ్ఞాపకాలతో నిండిన రోజు. ఈ కొత్త జీవితబంధంలోకి, అధ్యాయంలోకి నువ్ అడుగు పెట్టడం చూశాను. దాంతో మా హృదయాలు ఉప్పొంగిపోయాయి" అని అర్జున్ సర్జా రాసుకొచ్చాడు.

"మీరు ఎలా ప్రేమను పంచుకున్నారో అలా జీవితాంతం ఇలాగే ప్రయాణించాలని, జీవితకాలపు ప్రేమ, సంతోషంతో నిండాలని వేలకోట్ల ఆశీర్వాదాలు పొందాలి" అని అర్జున్ సర్జా ఎమోషనల్‌గా వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడమే కాకుండా నెటిజన్స్ హృదయాలను తాకుకుంది.

ఇదిలా ఉంటే, ఐశ్వర్య అర్జున్ వివాహం చేసుకున్న ఉమాపతి రామయ్య ప్రముఖ నటుడు, కమెడియన్, డైరెక్టర్ తంబి రామయ్య కుమారుడు. తంబి రామయ్యను వీడియోలో కూడా చూడొచ్చు. కొన్నేళ్లు ప్రేమ, డేటింగ్ చేసిన తర్వాత ఐశ్వర్య-ఉమాపతి జూన్ 10న చెన్నైలో వైభవంగా పెళ్లాడారు.

ఈ పెళ్లిలో ఐశ్వర్య సంప్రదాయ ఎరుపు, బంగారు పట్టు చీరలో మెరిసిపోగా, ఉమాపతి ఐవరీ ధోతీ సెట్‌ను ఎంచుకున్నారు. ఉమాపతి తాళి కట్టడం, ఐశ్వర్య ఉమాపతికి పూలమాల వేయడానికి ప్రయత్నించడం, ఇద్దరూ నీటి కుండలో ఉంగరాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న చిత్రాలను ఈ జంట ఇదివరకే షేర్ చేశారు. చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో ఉదయం 9-10 గంటల మధ్య వీరి వివాహం జరిగింది.

2021లో అర్జున్ సర్జా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సర్వైవర్ తమిళ్ అనే రియాలిటీ షోలో ఐశ్వర్య, ఉమాపతి కలుసుకున్నారు. తర్వాత వీరి ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2023 అక్టోబర్ 28న నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 7 నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు చెన్నైలోని అర్జున్ నివాసంలో నిర్వహించారు.

WhatsApp channel