Chiranjeevi on Tillu Square: అది కష్టమైన విషయం.. కానీ సాధించారు: టిల్లు స్క్వేర్‌పై చిరంజీవి కామెంట్స్-tillu square met huge the expectations says chiranjeevi and praises siddhu jonnalagadda and his team ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi On Tillu Square: అది కష్టమైన విషయం.. కానీ సాధించారు: టిల్లు స్క్వేర్‌పై చిరంజీవి కామెంట్స్

Chiranjeevi on Tillu Square: అది కష్టమైన విషయం.. కానీ సాధించారు: టిల్లు స్క్వేర్‌పై చిరంజీవి కామెంట్స్

Chiranjeevi on Tillu Square Movie: టిల్లు స్క్వేర్ మూవీ టీమ్‍ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఇంటికి పిలిపించుకొని వారితో మాట్లాడారు. ఈ చిత్రంపై ఆయన ప్రశంసలు కురిపించారు.

Chiranjeevi on Tillu Square: అది కష్టమైన విషయం.. కానీ సాధించారు: టిల్లు స్క్వేర్‌పై చిరంజీవి కామెంట్స్

Chiranjeevi on Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మోతమోగిస్తోంది. ఈ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకులను విపరితంగా ఆలరిస్తున్న ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఈ తరుణంలో టిల్లు స్క్వేర్ మూవీ టీమ్‍ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

ఇంటికి పిలిపించుకొని..

టిల్లు స్క్వేర్ మూవీ టీమ్‍ను ఇంటికి పిలుపించుకొని అభినందించారు చిరంజీవి. హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీ నేడు (ఏప్రిల్ 1) మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. వారిని చిరంజీవి ప్రశంసించారు. తాను టిల్లు స్క్వేర్ చిత్రాన్ని చూశానని చాలా నచ్చిందని అన్నారు.

అంచనాలను అందుకున్నారు

ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సీక్వెల్‍కు అంచనాలను అందుకోవడం చాలా కష్టమని, అయితే దీన్ని సక్సెస్‍ఫుల్‍గా టిల్లు స్క్వేర్ టీమ్ సాధించిందని చిరంజీవి ప్రశంసించారు. “టిల్లు స్క్వేర్ సినిమా చూశా. టిల్లు 1 (డీజే టిల్లు) నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాత ముచ్చటేసి సిద్దును ఓసారి ఇంటికి పిలిపించుకున్నా.సిద్ధు అంటే ఇంట్లో అందరికీ చాలా ఫేవర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా చేశాడు. చూశాను. వావ్.. నాకు చాలాచాలా నచ్చింది. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా అంచనాలను అందుకోవడం చాలా కష్టం. ఆ అరుదైన ఫీట్‍ను డైరెక్టర్ మల్లిక్ రామ్, వంశీ టీమ్ అంతా కలిసి సక్సెస్‍ఫుల్‍గా చేయగలిగారు” అని చిరంజీవి అన్నారు.

ఉత్కంఠ, నవ్వులు, సరదాతో తాను టిల్లు స్క్వేర్ మూవీని ఎంతో ఎంజాయ్ చేశానని చిరంజీవి చెప్పారు. దీని కోసం సిద్ధు ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో తనకు తెలుసునని చిరూ చెప్పారు. నటనతో పాటు స్క్రిప్ట్ కూడా అద్భుతంగా చేశారని సిద్ధును అభినందించారు. ఈ సినిమా అందరూ చూడాల్సిన చిత్రం అని చిరంజీవి చెప్పారు.

టిల్లు స్క్వేర్ కలెక్షన్లు

టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి అదరగొడుతోంది. ఏకంగా మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.68కోట్ల కలెక్షన్లను సాధించింది. పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ దూసుకెళుతోంది. అందులోనూ పెద్దగా పోటీ కూడా లేకపోవటంతో ఈ చిత్రం తిరుగులేకుండా సాగుతోంది. టిల్లు స్క్వేర్ రూ.100 కోట్ల మార్కును అలవోకగా దాటేయనుంది. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు మార్క్ యాక్టింగ్, కామెడీ, డైలాగ్స్ అదిరిపోయాయని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

టిల్లు స్క్వేర్ మూవీకి సిద్దు జొన్నలగడ్డ, రవి ఆంథోనీ స్క్రిప్ట్ అందించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.