Rana OTT Talk Show: ఓటీటీలో హీరో దగ్గుబాటి రానా టాక్ షో.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..-the rana connection talk show to steam on amazon prime video ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana Ott Talk Show: ఓటీటీలో హీరో దగ్గుబాటి రానా టాక్ షో.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Rana OTT Talk Show: ఓటీటీలో హీరో దగ్గుబాటి రానా టాక్ షో.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

The Rana Connection OTT Talk Show: హీరో దగ్గుబాటి రానా మరోసారి టాక్ షో హోస్ట్ చేయనున్నారు. ఈ టాక్ షో గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ది రానా కనెక్షన్ పేరుతో ఈ టాక్ షో రానుంది.

The Rana Connection OTT: ఓటీటీలో హీరో దగ్గుబాటి రానా టాక్ షో.. కరణ్ జోహార్‌కు గట్టి పోటీనే!

The Rana Connection OTT: టాలీవుడ్ హల్క్, హీరో దగ్గుబాటి రానాకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాహుబలి కంటే ముందే బాలీవుడ్‍లోనూ ఆయన ఫేమస్ అయ్యారు. అయితే, బాహుబలి తర్వాత రానా క్రేజ్ నెక్ట్స్ లెవెల్‍కు వెళ్లింది. అది అలానే కొనసాగుతోంది. రానా నాయుడు వెబ్ సిరీస్‍తో ఓటీటీ స్పేస్‍లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు రానా. ఇప్పుడు ఓ ఓటీటీలో టాక్‍షో చేసేందుకు రెడీ అయ్యారు.

ది రానా కనెక్షన్

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘ది రానా కనెక్షన్’ పేరుతో టాక్ షో హోస్ట్ చేయనున్నారు రానా. నేడు (మార్చి 19) జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్‍లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియా కింద ఈ టాక్ షో ప్రొడ్యూజ్ చేయనున్నారు రానా.

ఇండియన్ సినిమా నుంచి తన ఫ్రెండ్స్, సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది. రెడీగా ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ‘ది రానా కనెక్షన్’ టాక్ షో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందో అమెజాన్ ప్రైమ్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది.

రానాకు రెండో టాక్ షో..

గతంలో ‘నంబర్ 1 యారీ’ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు దగ్గుబాటి రానా. ఇది ఆహా ఓటీటీలో చాలా పాపులర్ అయింది. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో చేశారు రానా. అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేయనున్న ఈ ‘ది రానా కనెక్షన్’ టాక్ షో నేషనల్ వైడ్‍గా ఉండనుంది. టాలీవుడ్, బాలీవుడ్‍తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాఫీ విత్ కరణ్‍కు గట్టి పోటీ!

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసే కాఫీ విత్ కరణ్ టాక్ షో చాలా ఫేమస్. చాలా ఏళ్ల నుంచి ఆయన సీజన్లుగా ఈ టాక్ షో చేస్తున్నారు. నేషనల్ లెవెల్‍లో దీనికి గట్టి పోటీ లేదు. అయితే, ‘ది రానా కనెక్షన్’ వస్తే.. కాఫీ విత్ కరణ్‍కు మంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మంచి సెన్సాఫ్ హ్యూమర్, మాటకారితనం ఉన్న రానా.. టాక్ షోతో మరోసారి ఆకట్టుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బాలీవుడ్‍లోనూ రానాకు మంచి కనెక్షన్లు ఉండటంతో బడా సెలెబ్రెటీలు కూడా ఈ టాక్ షోకు వచ్చే ఛాన్స్ ఎక్కువ.

రానాకు విలక్షణ నటుడిగా కూడా పేరు ఉంది. హీరోగానే కాకుండా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లోనూ ఆయన చేశారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. ముఖ్యంగా కొత్త టాలెంట్‍ను, విభిన్నమైన కంటెంట్‍ను ప్రోత్సహించేందుకు రానా ముందుటారు.

రానా తదుపరి సినిమాలు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టైయాన్ చిత్రంలో రానా దగ్గుబాటి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‍లో ఆయన పాల్గొన్నారు. రానా ప్రధానపాత్రలో హిరణ్యకశ్యప మూవీని కూడా ప్రకటించారు. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మైథలాజికల్ చిత్రం ఉండనుంది. ఈ మూవీని ఆయనే నిర్మించనున్నారు.