Rana Daggubati on National Awards: నేష‌న‌ల్ అవార్డ్స్‌పై నాని అభిప్రాయంలో త‌ప్పేం లేదు - ఫ్రెండ్‌కు స‌పోర్ట్ చేసిన రానా-rana daggubati supports nani in national awards controversy comments viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana Daggubati On National Awards: నేష‌న‌ల్ అవార్డ్స్‌పై నాని అభిప్రాయంలో త‌ప్పేం లేదు - ఫ్రెండ్‌కు స‌పోర్ట్ చేసిన రానా

Rana Daggubati on National Awards: నేష‌న‌ల్ అవార్డ్స్‌పై నాని అభిప్రాయంలో త‌ప్పేం లేదు - ఫ్రెండ్‌కు స‌పోర్ట్ చేసిన రానా

HT Telugu Desk HT Telugu
Sep 04, 2023 11:12 AM IST

Rana Daggubati on National Awards: సూర్య జైభీమ్ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్స్ రాక‌పోవ‌డం త‌న‌కు బాధ‌ను క‌లిగించిందంటూఇటీవ‌ల హీరో నాని చేసిన పోస్ట్ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నాని పోస్ట్‌పై హీరో రానా రియాక్ట్ అయ్యాడు. నాని ట్వీట్‌లో కాంట్ర‌వ‌ర్సీ ఏం లేద‌ని రానా అన్నాడు

రానా
రానా

Rana Daggubati on National Awards: నేష‌న‌ల్ అవార్డ్స్ విష‌యంలో వ‌స్తోన్న ట్రోల్స్‌ఫై రానా ద‌గ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పుష్ప సినిమాలో పుష్ప‌రాజ్‌గా అద్వితీయ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన అల్లు అర్జున్ బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరీలో అవార్డు అందుకున్న తొలి తెలుగు న‌టుడిగా చ‌రిత్ర‌ను సృష్టించాడు. పుష్ప సినిమాలో బ‌న్నీ ఎర్ర చంద‌నాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేసే స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో న‌టించాడు.

స్మ‌గ్ల‌ర్ రోల్‌కు నేష‌న్ అవార్డు ఇవ్వ‌డం స‌రికాదంటూ కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ట్రోల్ చేస్తున్నారు. మ‌రోవైపు అల్లు అర్జున్‌కు అవార్డును ప్ర‌క‌టించిన త‌ర్వాత త‌మ‌కు అవార్డులు ముఖ్యం కాదంటూ కొంద‌రు టాలీవుడ్ హీరోలు చేసిన కామెంట్స్ కూడా వైర‌ల్ అయ్యాయి. మ‌రోవైపు జైభీమ్‌కు అవార్డు రాక‌పోవ‌డంతో త‌న హృద‌యం ముక్క‌లైన ఫీలింగ్ క‌లిగిందంటూ నాని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ కూడా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నాని పోస్ట్‌తో పాటు పాటు అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు ఇవ్వ‌డంపై వ‌స్తోన్న‌ ట్రోల్స్ ప‌ట్ల రానా రియాక్ట్ అయ్యాడు. ఆదివారం సైమా అవార్డ్స్ కు సంబంధించి ఏర్పాటు చేసిన ఓ పాత్రికేయుల స‌మావేశంలో రానా మాట్లాడుతూ అవార్డుల‌పై కాంట్ర‌వ‌ర్సీలు ఏం లేవ‌ని అన్నాడు. సినిమాల విష‌యంలో ఒక్కొక్క‌రి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కోలా ఉంటాయ‌ని రానా తెలిపాడు.

అన్ని సినిమాలు అంద‌రికి న‌చ్చాల‌ని ఏం లేద‌ని చెప్పాడు. అర్టిస్ట్‌ల అభిరుచులు కూడా అలాగే ఉంటాయ‌ని రానా పేర్కొన్నాడు ఫ‌లానా క‌థ‌కు అవార్డులు రావాల‌ని చాలా మంది అనుకున్నారు. కానీ రాలేదు. అంతే కానీ బ‌న్నీకి ఎందుకొచ్చింద‌న్న‌ది కాద‌ని రానా తెలిపాడు. ఆ ఉద్దేశంతో హీరోలు ఎవ‌రూ పోస్ట్‌లు, ట్వీట్‌లు పెట్ట‌లేద‌ని రానా చెప్పాడు.

ఆర్టిస్టులు ఎప్పుడూ కాంట్ర‌వ‌ర్సీలు చేయాల‌ని ట్వీట్స్ చేయ‌ర‌ని, కాంట్ర‌వ‌ర్సీలు చేసేదే మీరే అంటూ పాత్రికేయుల‌పైనే రానా సెటైర్ వేశాడు. నేష‌న‌ల్ అవార్డుల‌ను ఉద్దేశించి రానా చేసిన‌ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

టాపిక్