Game Changer Thaman: రామ్‍చరణ్ అభిమానులకు నిరాశేనా! థమన్ ఏం చెప్పారంటే..-thaman hints game changer teaser postponement from dussehra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Thaman: రామ్‍చరణ్ అభిమానులకు నిరాశేనా! థమన్ ఏం చెప్పారంటే..

Game Changer Thaman: రామ్‍చరణ్ అభిమానులకు నిరాశేనా! థమన్ ఏం చెప్పారంటే..

Game Changer Thaman: గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా ట్వీట్లు చేశారు. దసరా పండుగకు టీజర్ రావటం కష్టమే అనేలా చెప్పారు. అయితే, మూడో పాట డేట్‍ను కన్ఫర్మ్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Game Changer Thaman: రామ్‍చరణ్ అభిమానులకు నిరాశేనా! థమన్ ఏం చెప్పారంటే..

గేమ్ ఛేంజర్ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అప్‍డేట్ల విషయంలో ప్రొడక్షన్ హౌస్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకుడు శంకర్ కంటే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. కొంతకాలంగా ఈ మూవీపై అప్‍డేట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ వస్తుందని ఇటీవలే ఓ ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయంలో నిరాశ ఎదురవుతుందనేలా నేడు (అక్టోబర్ 8) థమన్ ఓ హింట్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ దసరాకు వస్తుందని థమన్ చెప్పడంతో అక్టోబర్ 12న రానుందని ఫ్యాన్స్ సంతోషపడ్డారు. అయితే, దసరా పండుగకు టీజర్ రిలీజ్ కష్టమే అన్నట్టు థమన్ నేడు ట్వీట్లు చేశారు. “దసరాకు టీజర్ రాలేదు అని నిరాశ పడొద్దండి” అంటూ థమన్ పోస్ట్ చేశారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. మూడో పాట డేట్

గేమ్ ఛేంజర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయనేలా థమన్ ట్వీట్ చేసారు. అక్టోబర్ 30న మూడో పాట రానుందని కూడా తెలిపారు. “పనులను పూర్తి చేసేందుకు టీమ్ కృషి చేస్తోంది. మూవీ సీజీ వీఎఫ్‍ఎక్స్ ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్ పనులు సాగుతున్నాయి. బీజీఎం స్కోర్ ఇప్పటికే మొదలైంది. అన్ని పాటలకు లిరికల్ వీడియోలు తయారవుతున్నాయి. ప్రతీ నెల రిలీజ్ చేస్తాం. ఈనెల అక్టోబర్ 30వ తేదీ పాట వస్తుంది” అని థమన్ వెల్లడించారు.

రిలీజ్ డేట్‍పై..

గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న విడుదలవుతుందని రెండో పాట సమయంలో థమన్ వెల్లడించారు. అయితే, ఇప్పుడు కాస్త మార్చారు. డిసెంబర్ 20 లేకపోతే క్రిస్మస్‍కు వస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 25వ తేదీని కూడా మూవీ టీమ్ పరిశీలిస్తోందని అంచనాలు ఉండగా.. థమన్ కూడా అదే డౌట్‍లో పెట్టారు.

దసరాకు కాకపోతే దీపావళికి..

పాటల కంటే ముందు టీజర్‌పై క్లారిటీ ఇవ్వాలని వచ్చిన ఓ ట్వీట్‍కు థమన్ రియాక్ట్ అయ్యారు. సినిమా అద్భుతంగా ఉండేలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు లార్జ్ స్కేల్‍లో భారీగా సాగుతున్నాయని థమన్ తెలిపారు. ఫ్లోతో పాటు టీజర్ కంటెంట్ వస్తుందని తెలిపారు. దసరాకు కాకపోతే దీపావళికి వస్తుందని వెల్లడించారు. అద్భుతంగా ఉండాలని తాము కూడా అనుకుంటున్నామని ట్వీట్ చేశారు. అందరూ పాజిటివ్‍గా ఉండాలని, మద్దతునివ్వాలని థమన్ కోరారు.

మొత్తంగా దసరా పండుగకు గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ రాకపోవచ్చని థమన్ చెప్పేశారు. మరి స్పెషల్‍గా మేకర్స్ ఏదైనా వీడియో లేకపోతే పోస్టర్ అయినా తీసుకొస్తారేమో చూడాలి.

గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఇటీవలే ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ వచ్చింది. ఈ మాస్ బీట్ సాంగ్‍కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ స్టెప్‍లు ఇరగదీశారు. డైరెక్టర్ శంకర్ మార్క్ గ్రాండ్‍నెస్ కనిపించింది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ నటించారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీరోల్స్ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.