Game Changer Teaser: గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ఎప్పుడు రానుందో చెప్పిన థమన్-ram charan political action movie game changer teaser release date revealed by thaman ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Teaser: గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ఎప్పుడు రానుందో చెప్పిన థమన్

Game Changer Teaser: గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ఎప్పుడు రానుందో చెప్పిన థమన్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 02, 2024 08:18 AM IST

Game Changer Teaser: గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ అక్టోబర్‌లోనే రానుంది. అయితే, టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హింట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ పోస్టుకు రిప్లై ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Game Changer Teaser: గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ఎప్పుడు రానుందో చెప్పిన థమన్
Game Changer Teaser: గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ఎప్పుడు రానుందో చెప్పిన థమన్

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ‘రా మచ్చా మచ్చా’ అంటూ రీసెంట్‍గా సాంగ్ వచ్చింది. మాస్ బీట్‍తో ఉన్న ఈ పాట ఊపేస్తోంది. చాలా కాలంగా ఈ మూవీ నుంచి అప్‍డేట్లు, కంటెంట్ కోరుకుంటున్న చరణ్ అభిమానులను అలరించింది. గేమ్ ఛేంజర్ నుంచి వరుసగా అప్‍డేట్లు ప్లాన్‍ చేశామని దిల్‍రాజు ఇటీవలే చెప్పారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ గురించి మ్యూజిక్ థమన్ ఇప్పుడు వెల్లడించారు.

పండుగకు టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. థమన్ దానికి రిప్లై ఇచ్చారు. టీజర్ ఎప్పుడో రివీల్ చేశారు. “థమన్ అన్న టీజర్ ఎప్పుడు.. బీజీఎం సావకొట్టావ్ అని కాన్ఫిడెన్స్ ఉంది. రిప్లై ఇవ్వు” అని ఓ ట్వీట్ పోస్ట్ అయింది. దీనికి థమన్ స్పందించారు. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ అంటూ రిప్లై ఇచ్చారు.

దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ వస్తుందని థమన్ హింట్ ఇచ్చారు. అంటే అక్టోబర్ 12వ తేదీన టీజర్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. “రా మచ్చా మచ్చా” సాంగ్‍పై కూడా థమనే ముందుగా అప్‍డేట్లు ఇచ్చారు. ఇప్పుడు, టీజర్‌పై ఆయనే ఫస్ట్ హింట్ ఇచ్చారు.

రిలీజ్ డేట్‍ మారనుందా?

గేమ్ ఛేంజర్ చిత్రాన్ని క్రిస్మస్‍ సందర్భంగా తీసుకొస్తామని నిర్మాత దిల్‍రాజు గట్టిగా చెబుతున్నారు. ఈ మూవీ విడుదలపై ఎప్పుడు ప్రశ్న వచ్చినా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే, తేదీని మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ డిసెంబర్ 20వ తేదీన విడుదల అవుతుందని అంచనాలు బయటికి వచ్చాయి. అయితే, తాజాగా రిలీజ్ డేట్ ప్లాన్ మారిందని రూమర్లు బయటికి వచ్చాయి. డిసెంబర్ 25వ తేదీన సినిమా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కనీసం టీజర్లో అయినా రిలీజ్ డేట్ రివీల్ చేసి ఈ ఉత్కంఠకు మూవీ టీమ్ తెర దించుతుందేమో చూడాలి.

గేమ్ ఛేంజర్ సినిమాపై దిల్‍రాజు ఇటీవలే అప్‍డేట్లు ఇచ్చారు. ‘రా మచ్చా మచ్చా’ పాట రిలీజ్ సందర్భంగా లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్‍తో ఆయన ముచ్చటించారు. అక్టోబర్ నెలలో ఈ చిత్రం నుంచి టీజర్, మూడో పాట వస్తాయని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో క్రిస్మస్ సమయంలో చిత్రాన్ని రిలీజ్ చేసేలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు.

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్‍చరణ్ చేసిన గేమ్ ఛేంజర్ మూవీపై మంచి హైప్ ఉంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ కావటంతో క్యూరియాసిటీ మరింత నెలకొంది. ఈ మూవీలో ఐఏఎస్ అధికారి పాత్ర పోషించారు చరణ్. కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటించారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ భారీ బడ్జెట్‍ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.