Sandeep Reddy Vanga: స్పిరిట్ సినిమా గురించి అప్‍డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. హాలీవుడ్ రీమేక్‍కు నో చెప్పారట
Sandeep Reddy Vanga on Spirit: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తదుపరి ప్రభాస్‍తో సినిమా చేయనున్నారు. స్పిరిట్ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం గురించి తాజాగా ఓ అప్‍డేట్ ఇచ్చారు సందీప్.
Sandeep Reddy Vanga: యానిమల్ సినిమాతో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఆ మూవీ రూ.950 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపింది. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. తదుపరి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‍తో స్పిరిట్ మూవీ చేయనున్నారు సందీప్ రెడ్డి వంగా. ఆ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన అప్‍డేట్ ఇచ్చారు.
60 శాతం స్క్రిప్ట్ పూర్తి
స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ గురించి సందీప్ రెడ్డి వంగా అప్‍డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు 60 శాతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని గలాటా ప్లస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లో ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.
హాలీవుడ్ రీమేక్ వద్దాన్నా
కరోనా సమయంలో ప్రభాస్ నుంచి తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. యానిమల్ కంటే ముందే ఇది జరిగిందని అన్నారు. ప్రభాస్‍తో ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ ఆఫర్ వచ్చిందని, తాను నో చెప్పానని, ఒరిజినల్ కథతోనే చిత్రం చేద్దామని చెప్పినట్టు తెలిపారు. ఆ తర్వాత ప్రభాస్‍కు స్పిరిట్ కథ చెప్పానని ఆయన వెల్లడించారు.
“కరోనా వల్ల చాలా బ్రేక్స్ వచ్చాయి. అప్పుడు ప్రభాస్‍తో ఓ సినిమాకు ఆఫర్ వచ్చింది. కానీ అది జరగలేదు. అదో హాలీవుడ్ రీమేక్. అది నాకు వర్క్ అవదని చెప్పా. మీతో హాలీవుడ్ రీమేక్ చేసే బదులు ఒరిజినల్ ఐడియాతో సినిమా చేస్తే బాగుంటుందని చెప్పా. ఏదైనా గొప్పగా తోచితే మీ దగ్గరికి వస్తానని చెప్పా. అప్పుడు నేను యానిమల్ స్కిప్టులో ఉన్నా. కరోనా వల్ల బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, అప్పుడు నాకు ఐడియా వచ్చింది. అప్పుడు ప్రభాస్‍కు స్పిరిట్ స్టోరీ, క్యారెక్టర్ గురించి చెప్పా” అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
ప్రభాస్ లైనప్ ఇలా..
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం గ్లోబల్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది. ఆ తర్వాత దర్శకుడు మారుతీతో రాజాసాబ్ చిత్రం చేయనున్నారు ప్రభాస్.
రాజాసాబ్ పూర్తయ్యాక.. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మొదలుపెట్టనున్నారు ప్రభాస్. డిసెంబర్‌లో స్పిరిట్ చిత్రీకరణ మొదలవుతుందని సందీప్ మరోసారి చెప్పారు. ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించనున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఆ చిత్రం రూపొందుతుందని సందీప్ వెల్లడించారు. స్పిరిట్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నాయి.
సలార్ సీక్వెల్ ‘సలార్ పార్ట్ 2: శౌర్యంగపర్వం’ చిత్రం కూడా ప్రభాస్ లైనప్‍లో ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ చేస్తున్న ఆ మూవీ షూటింగ్ కూడా ఇదే ఏడాది షురూ కానుంది. దర్శకుడు హను రాఘవపూడితోనూ మరో మూవీకి ప్రభాస్ ఓకే చెప్పారు. పీరియడ్ లవ్ స్టోరీగా ఆ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.