Salaar Hits 600 Crores: రూ.600కోట్ల క్లబ్‍లో సలార్.. అఫీషియల్‍గా ప్రకటించిన మేకర్స్.. ప్రభాస్‍కు మూడోది
Salaar Day 10 Worldwide Box Office Collections: సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. 10 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ వెల్లడించింది. వివరాలివే..

Salaar Day 10 Worldwide Box Office Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. కలెక్షన్ల ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అయింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ రావటంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రభాస్ హైవోల్టేజ్ యాక్షన్‍కు ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. సలార్ సినిమా 10 రోజుల బాక్సాఫీస్ లెక్కలను మూవీ యూనిట్ నేడు (జనవరి 1) వెల్లడించింది.
సలార్ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్ల గ్రాస్ కలెక్షన్ల సాధించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. “ఖాన్సార్.. నన్ను క్షమించు! అన్‍స్టాపబుల్ సలార్ సీజ్‍ఫైర్ రూ.625కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్లను (ప్రపంచవ్యాప్తంగా) దాటేసింది” అని పేర్కొంది. రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‍బాస్టర్ అంటూ పోస్ట్ చేసింది.
ప్రభాస్ మూడోసారి..
రూ.600కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించిన ప్రభాస్ మూడో చిత్రంగా సలార్ నిలిచింది. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి 1 (లైఫ్ టైమ్ రూ.650కోట్లు), బాహుబలి 2 (లైఫ్ టైమ్ సుమారు రూ.1,800 కోట్లు) సినిమాలు రూ.600 మార్కును దాటేశాయి. ఇప్పుడు సలార్ 10 రోజుల్లో రూ.600కోట్ల క్లబ్‍లో చేరింది. సోమవారం కొత్త సంవత్సరం (2024) రోజు కావటంతో సలార్ కలెక్షన్ల జోరు కొనసాగి ఉంటుంది. మంగళవారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి పరీక్ష మొదలుకానుంది.
ఇండియాలోనే సలార్ సినిమా రూ.420కోట్ల గ్రాస్ కలెక్షన్లను (రూ.360కోట్ల నెట్) 10 రోజుల్లో సాధించినట్టు లెక్కలు వెలువడుతున్నాయి. తెలుగులోనే ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.200 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమా పోటీలో ఉన్నా హిందీలో ఇప్పటి వరకు సుమారు రూ.120 కోట్ల నెట్ వసూళ్లను సలార్ రాబట్టింది. డంకీని మించిపోయింది.
టాపిక్